Bollywood hero who fell in love with Kriti Sanon

Kriti Sanon: బాలీవుడ్ నటి కృతి సనన్ తో నిజంగానే ఆ బాలీవుడ్ హీరో ప్రేమలో పడ్డారా.. పబ్లిక్ గా స్టేజ్ పైనే ఈ హీరోయిన్ పేరు అలా చెప్పేసారేంటి అని ఈ విషయం తెలిసి చాలామంది అవాక్కవుతున్నారు. మరి ఇంతకీ కృతి సనన్ తో ప్రేమలో పడ్డ ఆ బాలీవుడ్ హీరో ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.. కృతి సనన్ తెలుగులో మహేష్ బాబు వన్ నేనొక్కడినే, ప్రభాస్ తో ఆది పురుష్ వంటి సినిమాల్లో నటించింది. ఇక తెలుగులో అంతంత మాత్రంగానే గుర్తింపు సంపాదించిన ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో మాత్రం స్టార్ హీరోయిన్.ఈమె బాలీవుడ్ లో స్టార్ హీరోలతో జతకట్టి ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాల్లో నటించింది.అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ తో ఓ బాలీవుడ్ హీరో ప్రేమలో పడిపోయారంటూ మరో హీరో స్టేజ్ పైనే అందరూ చూస్తుండగా చెప్పారు.

Bollywood hero who fell in love with Kriti Sanon

ఇక అసలు విషయంలోకి వెళ్తే..రీసెంట్గా అమెజాన్ ప్రైమ్ వాళ్లు నిర్వహించిన ఒక ఈవెంట్ లో వరుణ్ ధావన్ టైగర్ ష్రాఫ్ గురించి మాట్లాడుతూ స్టేజిపై ఎన్నో జోకులు వేశాడు. ఇక ఇందులో భాగంగా టైగర్ ష్రాఫ్ నేను ఎవరితోనూ అంత తొందరగా కలిసిపోను. ఎవరితో కూడా సరిగ్గా మాట్లాడను. అందుకే 25 సంవత్సరాల వరకు నేను ఏ అమ్మాయితో కూడా ప్రేమలో పడలేదు.25 సంవత్సరాల వరకు నాకంటూ ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా లేదు అంటూ టైగర్ ష్రాఫ్ చెప్పారు. ఇక దీనికి వరుణ్ ధవన్ స్పందిస్తూ..ఏంటి నిజంగానే 25 సంవత్సరాల వరకు ఒక్క లవర్ కూడా లేదా అని అడగగా.. (Kriti Sanon)

Also Read: Game Changer: గేమ్ ఛేంజ‌ర్ ఓటీటీ డీల్ క్లోజ్‌.. క‌ళ్లు చెదిరే ధ‌ర ప‌లికిన డిజిట‌ల్ రైట్స్‌!

అవును నాకు 25 సంవత్సరాల వరకు ఒక్క గర్ల్ ఫ్రెండ్ కూడా లేదు.కానీ 25 సంవత్సరాలు నిండాకే మొదటి సినిమా ఆడిషన్ కి వెళ్ళిన సమయంలోనే తొలిసారి ప్రేమలో పడ్డాను అంటూ చెప్పారు.అయితే మొదటి సినిమా సమయం అంటే కృతి సనన్ తో ప్రేమలో పడ్డారా అని వరుణ్ ధావన్ మళ్ళీ ప్రశ్నించారు..లేదు లేదు ఆమె కాదు మరొక పేరు చెప్పండి అని అన్నారు.దానికి వరుణ్ ధావన్ సారీ ఆమె నీకు మంచి ఫ్రెండ్..నేనేదో ఫన్నీగా మాట్లాడాను అంటూ వరుణ్ ధావన్ చెప్పారు. అయితే టైగర్ ష్rఫ్ మొదటిసారి ప్రేమలో పడింది బాలీవుడ్ నటి దిశా పటానీ తో..

Bollywood hero who fell in love with Kriti Sanon

వీరిద్దరూ చాలా సంవత్సరాలు చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. కానీ ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల విడిపోయారు. అయితే రీసెంట్గా ఓ ఈవెంట్లో వీళ్ళిద్దరూ కలిసినప్పుడు హగ్ చేసుకున్నప్పటికీ దిశా పటాని పక్కన టైగర్ ష్రాఫ్ మాత్రం కూర్చోలేదు. అయితే వీరిద్దరూ లవర్స్ గా బ్రేకప్ చెప్పుకున్నప్పటికీ ఫ్రెండ్స్ గా మాత్రం ఏదైనా ఈవెంట్, ఫంక్షన్ లో కలిసినప్పుడు మాట్లాడుకుంటారు. అలా వరుణ్ ధావన్ స్టేజ్ పై ఫన్నీగా కృతి సనన్ తో టైగర్ ష్రాఫ్ ప్రేమలో పడ్డాడా అని అడగడంతో ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారడంతో ఇందులో ఎలాంటి నిజం లేదు కేవలం సరదాగా అలా అన్నాను దీన్ని సీరియస్గా తీసుకోకండి అని కూడా వరుణ్ దావన్ చెప్పారు.(Kriti Sanon)

Join WhatsApp