Boyapati Srinu Geetha Arts Film Without Allu arjun

Boyapati Srinu: స్కంద సినిమా తో ప్రేక్షకులను అలరించిన మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తన తదుపరి సినిమా కోసం సన్నాహాలు మొదలుపెడుతున్నారు. గీత ఆర్ట్స్ లో తదుపరి సినిమా ఉండబోతుందని చాలా రోజులక్రితమే వార్తలు వచ్చాయి. దాదాపు ఆ బ్యానర్ లోనే బోయపాటి శ్రీను సినిమా ఉండబోతుంది. అయితే పెద్ద డైరెక్టర్ కాబట్టి, మాస్ ప్రేక్షకులను తీసుకురాగల సత్తా ఉన్న డైరెక్టర్ కాబట్టి తప్పకుండ అల్లు అరవింద్ అల్లు అర్జున్ తోనే ఈ సినిమా చేస్తాడని మొదటినుంచి అందరూ భావించారు.

Boyapati Srinu Geetha Arts Film Without Allu arjun

కానీ సీన్ ఇప్పుడు రివర్స్ అయ్యింది. బోయపాటి శ్రీను తదుపరి చేసే సినిమా గీతా ఆర్ట్స్ లోనే అయినా అల్లు అర్జున్ హీరో కాదట ఆ సినిమాలో. వీరిద్దరి కలయిక లో సరైనోడు సినిమా వచ్చింది. అది ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో అందరికి తెలిసిందే. అల్లు అర్జున్ కి మాస్ లో ఇమేజ్ ను రెట్టింపు చేసిన సినిమా ఇది. అలాంటి డైరెక్టర్ తో ఇంకో సినిమా అంటే బన్నీ ఫ్యాన్స్ కి పండగే. వాస్తవానికి సరైనోడు తర్వాత వెంటనే ఈ కాంబో సినిమా ఉంటుంది అన్నారు. కానీ ఎందుకో కుదరలేదు.(Boyapati Srinu)

Also Read: HONOR X9B: సరికొత్త టెక్నాలజీ తో హానర్.ఫీచర్స్ ఇవే.!

బోయపాటి చిన్న హీరోలతో చేయడం, కుదిరినప్పుడు బాలయ్యతో సినిమాలు చేస్తూ వచ్చాడు. ఫైనల్ గా ఇప్పుడు వీరికి టైం కి కుదిరింది అని అనుకుంటుండగా ఫైనల్ ట్విస్ట్ లా ఈ వార్త బయటకి వచ్చింది. స్కంద సినిమా పూర్తి చేసి బోయపాటికి నాలుగైదు నెలలు అయ్యింది. అల్లు అర్జున్ తో సినిమా చేయాలి అంటే మరో నాలుగైదు నెలలైనా పట్టేలా ఉంది. పుష్ప 2 సినిమా షూటింగ్ లో ఉన్న బన్నీ ఈ ఏడాది చివరిదాకా రాదు. అలాంటప్పుడు ఏడాది సమయాన్ని వృధా చేయడం ఇష్టం లేక బోయపాటి ఈ బ్యానర్ లోనే వేరే హీరో తో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు.

దీనికి అల్లు అరవింద్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇప్పుడు వీరు ఓ స్టార్ హీరో ను వెతికే పనిలో ఉన్నారట. ఇప్పుడు ఏ హీరో కూడా ఫ్రీ గా లేకపోవడంతో తమిళ హీరో తో సినిమా చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన చేస్తున్నారు. సూర్య లేదా విక్రమ్ తో గీతా ఆర్ట్స్ తో మంచి సంబంధాలు ఉన్నాయి. వీరికి బోయపాటి తో సినిమా చేయడం కూడా ఇష్టమే కాబట్టి వీరిలో ఒకరితో గీతా ఆర్ట్స్ సినిమా ఖాయం అవడం ఖాయం. లేదంటే విజయ్ దేవరకొండ తో సినిమా చేసే ఆలోచనలో బోయపాటి, అల్లు అరవింద్ లు ఉన్నారట. ఎలాగూ వీరిద్దరికి విజయ్ ఓ సినిమా చేయాల్సిన కమిట్మెంట్ ఉంది. చిరంజీవి తోనూ బోయపాటి సినిమా లేకపోలేదు అని కొంతమంది అంటున్నారు. (Boyapati Srinu)

Join WhatsApp