Chiranjeevi called Sumani by such a name in front of everyone

Chiranjeevi: యాంకరింగ్ లో ఆరితేరిన సుమ కనకాల గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. యాంకరింగ్ లో తనకి తానే సాటి అంటూ దూసుకుపోతున్న సుమ ప్రస్తుత కాలంలో కొంచెం స్లో అయింది. ఈ క్రమంలోనే శ్రీముఖి, ప్రదీప్ మరియు సుధీర్ వంటి వారు ముందు లిస్టులో కొనసాగుతున్నారు. ఇక ఇటీవల గూగుల్ సర్వేలో సుమ కనకాల నాలుగో స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. సుధీర్ మొదటి స్థానంలో ఉండగా ప్రదీప్ రెండవ స్థానాన్ని దక్కించుకున్నాడు.

Chiranjeevi called Sumani by such a name in front of everyone

ఇక మూడో స్థానాన్ని ఆది దక్కించుకోగా సుమ కి నాల్గవ స్థానం దక్కింది. దీంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయారు. ప్రెస్ మీట్ లకి పెట్టింది పేరు సుమ కనకాల. అదేవిధంగా కొన్ని కార్యక్రమాలను కూడా చేస్తూ తన సత్తా నిరూపించుకుంది. కొన్ని దశాబ్దాల పాటు ఇండస్ట్రీలో కొనసాగుతూ ఇంకా సుమ అక్కగానే మిగిలిపోయింది. ఆమె ఆంటీ అవ్వడం ఏమో కానీ ఆమె చేసే యాంకరింగ్ కి ప్రతి ఒక్కరు ఫిదా అవుతారు. తన కామెడీ పంచులతో ప్రతి ఒక్కరిని ఆకర్షించింది.

Also Read: Sridevi: వాట్.. శ్రీదేవి తన కూతురు జాన్విని అటువంటి పేరుతో పిలిచేదా.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

ఇక ప్రస్తుత కాలంలో కూడా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే యాంకర్ ని వెతుక్కోవాల్సిన పని లేకుండా సుమానే ఎంచుకుంటారు ప్రతి ఒక్కరు. ఇక సుమకి ఖాళీ లేకపోతే వారి ప్రీ రిలీజ్ ఈవెంట్లని కూడా వాయిదా వేసుకుంటారు. అంతటి క్రేజ్ కలిగినది మరి సుమ. అలాంటి ఈమెని చిరంజీవి ఓ పేరుతో అందరి ముందు పిలిచేటప్పటికీ ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు.సాధారణంగా ప్రస్తుత కాలంలో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారు వరకు సుమని అక్క అనే పిలుస్తూ ఉంటారు.

Chiranjeevi called Sumani by such a name in front of everyone

అప్పుడప్పుడు ఆంటీ అని పిలిచినప్పుడు సుమ చాలా ఫీల్ అవుతుంది కూడా. కానీ మొట్టమొదటిసారి చిరంజీవి ఆంటీ అని పిలిచేదప్పటికి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయారు. ఆపరేషన్ వాలెంటైన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న చిరు కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అక్కడే ఉన్న నవదీప్ కి చెబుతూ..” సుమ అక్క కాదు ఆంటీ అని పిలవండి. నాతో పాటు ఇండస్ట్రీలో రాణిస్తున్న నేను తాతయ్యను అయ్యాను కానీ సుమ ఆంటీ అవ్వలేదు. అందువల్ల సుమ ని ఇకనుంచి అందరూ ఆంటీ అని సంబోధించండి ” అంటూ వెల్లడించాడు చిరంజీవి. ప్రస్తుతం చిరంజీవి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(Chiranjeevi)

Join WhatsApp