Chiranjeevi's Award Controversy

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీలోకి ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టిన ఈయన మంచి పాపులారిటీని దక్కించుకున్నాడు. ఇక వరుస విజయాలను అందుకుంటూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుత కాలంలో కూడా స్టార్ హీరోలకి గట్టి పోటీ ఇస్తూ తన సత్తా చాటుకుంటున్నాడు. ఇక ప్రస్తుతం చిరంజీవి ” విశ్వంభర ” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై మెగాస్టార్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.

Chiranjeevi’s Award Controversy

ఇక చిరుకి ఇటీవలే పద్మ విభూషణ్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. ది లెజెండ్రీ నటుడు నందమూరి తారకరామారావు కి కూడా రాని పద్మ విభూషణ్ చిరుకి ఎలా వచ్చిందని చాలామంది ‌ తమ క్వషన్స్ని పొందుపరిచారు? అలానే గతంలో బన్నీకి సైతం నేషనల్ అవార్డు దక్కింది. వీరి ఫ్యామిలీలో మాత్రమే ఇలాంటి అవార్డులు ఎందుకు వస్తున్నాయి? వీరికన్నా పెద్ద నటులు నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు వంటి నటులు కి ఎందుకు రాలేదు అని క్వశ్చన్ అందరిలోనూ వినిపిస్తుంది.

Also Read: Hair: వన్ ప్లస్ వన్ ఆఫర్ అన్నట్లు ఈ నూనెతో జుట్టుతో పాటు కాంతివంతమైన చర్మం కూడా మీ సొంతం..!

ఇక దీనికి చిరు కూడా ఏమాత్రం స్పందించలేదు. ఒకింత చెప్పాలంటే చిరు కన్నా బాలయ్యకే తన కెరీర్ లో ఎక్కువ విజయాలు ఉన్నాయి. చిరు ఫాలోయింగ్ తో పోలిస్తే బాలయ్య ఫాలోయింగ్ ఎక్కువే ఉంటుంది. కానీ ఈ అవార్డు మాత్రం చిరుకే దక్కింది. ఇక ఇందుకు కారణం ఉందంటున్నారు ప్రేక్షకులు. చిరు అక్షరాల రూ. 20 లక్షలు పెట్టి పద్మ విభూషణ్ అవార్డు కొనుక్కున్నాడు అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.. గతంలో బన్నీపై కూడా ఇటువంటి ట్రోల్స్ నడిచిన సంగతి తెలిసిందే.

Chiranjeevi's Award Controversy

ఇక ప్రస్తుతం ఇటువంటి వార్త చిరు పై కూడా వినిపిస్తుంది. ఇక ఇదిలా ఉంటే ఓ హీరోయిన్ కూడా చిరంజీవి పద్మ విభూషణ్ అవార్డుపై కొన్ని వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. చిరు రాజకీయ నేతల కాళ్లు పట్టుకుని ఈ అవార్డు సొంతం చేసుకున్నాడని ఆ హీరోయిన్ వ్యాఖ్యలు చేసింది. ఇక దీంతో ఈ వార్త మరింత షికారు చేయడం మొదలు పెట్టింది. ఇక ప్రస్తుతం ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ నెట్టింట వైరల్ గా మారింది.(Chiranjeevi)

Join WhatsApp