Chiranjeevi "Vishwambhara" completed the highlight schedule

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు చిరు. అంతేకాకుండా తన ఫ్యామిలీ నుంచి పలువురును ఇండస్ట్రీలోకి తీసుకొస్తూ వారికి కూడా మంచి సక్సెస్ లు అందేలాగా చేశాడు.

Chiranjeevi “Vishwambhara” completed the highlight schedule

ఇక తాజాగా చిరంజీవి కథానాయకుడిగా వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న సోషియో ఫాంటసీ మూవీ ” విశ్వంభరా “. ఈ మూవీ సర్వేగంగా చిత్రీకరణ పూర్తి చేసుకుంటుంది. ఇక తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. భారీ సెట్లో యాక్షన్ ఎపిసోడ్ షూటింగ్ పూర్తయిందట. 26 రోజుల పాటు జరిగిన ఈ షెడ్యూల్లో ఇంటర్వెల్ ఫైటింగ్ సీన్స్ ను చిత్రీకరించారు.

Also Read: Glowing skin Tips: శాశ్వతమైన ముఖ సౌందర్యాన్ని పొందాలనుకుంటున్నారా?.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

ఇందుకోసం 54 అడుగుల హనుమాన్ విగ్రహాన్ని రూపొందించారు. ఈ సన్నివేశం సినిమాకే అదనపు ఆకర్షణ కలిగిస్తున్నట్లు తెలుస్తుంది. యాక్షన్ కొరియోగ్రాఫర్లు రామ్ లక్ష్మణ్ పర్యవేక్షణ లో దీన్ని చిత్రీకరించారు. హై లెవెల్ బి ఎఫ్ ఎక్స్ లతో ఫాంటసీ ప్రపంచాన్ని సృష్టించారు. ఇటీవల హనుమాన్ విగ్రహం వద్ద చిరు దిగిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయ్యాయి.

Chiranjeevi "Vishwambhara" completed the highlight schedule

ఇది సినిమాలో ఎలా ఉంటుందా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సోషియో ఫాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్ గా వస్తున్న విశ్వంభరా మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కానుంది. 18 ఏళ్ల తర్వాత చిరు మరియు త్రిష ఈ సినిమా కోసం కలిసి నటిస్తుండడంతో ఈ మూవీపై మరిన్ని అంచనాలు పెరిగాయి. ఇక ఈ మూవీ దాదాపు రూ. 200 కోట్ల భారీ బడ్జెట్ తో దీన్ని చిత్రీకరించినట్లు తెలుస్తుంది. చిరంజీవి కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్గా ఈ మూవీ రూపొందుతుంది.(Chiranjeevi)

Join WhatsApp