Chiranjeevi's interesting comments

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తన కెరీర్ లో 150 కి పైగా సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు చిరు. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సాధారణ మనుషులు కూడా ఇండస్ట్రీలో ఎదగవచ్చు అనే మాటకి అర్థం చెప్పాడు.‌

Chiranjeevi’s interesting comments

ఇక తాజాగా వైద్య పరీక్షల ఖర్చు సినీ కార్మికులకు అందుబాటులో ఉండేలా చేయగలవా? అని విజ్ఞప్తి చేయగానే యోదా డయాగ్నొస్టిక్ ఫౌండర్, ఛైర్మన్ సుధాకర్ కంచర్ల కాదనలేదని పేర్కొన్నారు చిరంజీవి. యోదా కొత్త బ్రాంచ్ ఓపెనింగ్ కు ముఖ్య అతిథిగా హాజరైన చిరు నాటి సంగతులను గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలోనే చిరంజీవి మాట్లాడుతూ..” చాలామంది సినీ కళాకారులు మరియు కార్మికులు ఏ రోజు సంపాదన తో ఆ రోజు గడుపుతుంటారు.

Also Read: Tamarind Seeds: వాట్.. చింత గింజలు తినడం వల్ల ఏకంగా ఇన్ని ప్రయోజనాలా?… ఇంతకాలం తెలియక మిస్ అయిపోయామే..!

అలాంటి వారికి ఇక్కడ వైద్య పరీక్షలకు అందుబాటు ధరల్లో చేయగలవా? అని గతంలో అమీర్పేటలో ఈ సెంటర్ ని ప్రారంభించిన సమయంలో సుధాకర్ ను సడన్గా అడిగా. కచ్చితంగా చేస్తానన్నయ్య అని తెలిపాడు. ఆ మేరకు 14 వేల మంది కార్మికులకు చిరంజీవి చారిటబుల్ టెస్ట్, యోదా డయాగ్నొస్టిక్స్ సెంటర్ సంయుక్తంగా హెల్త్ కార్డులు ఇచ్చారు. కార్డులు జారీ చేసిన వారితో పాటు కుటుంబానికి వెసులుబాటు కలిగించారు.

సామాజిక సేవలు కలిగిన అతనిపై నాకు గౌరవం ఉంది ” అంటూ చెప్పుకొచ్చాడు చిరు. ప్రస్తుతం చిరంజీవి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ వేడుకకు ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు కూడా పాల్గొన్నారు. ఇక ప్రస్తుతం చిరంజీవి విశ్వంభరా మూవీ షూటింగ్లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ మూవీలో త్రిష హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.(Chiranjeevi)

Join WhatsApp