Cine Critic Sensational Comments On Meena

Meena: బాలనటిగా తెలుగు చిత్ర సీమ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన అందాల ముద్దుగుమ్మ మీనా భర్త మరణం కారణంగా ఎన్నో ఇబ్బందులు పడుతోంది. అయితే తన భర్త తన నుండి దూరమైనా కూడా తన భర్తతో గడిపిన జ్ఞాపకాలు ఎప్పటికీ తనతో ఉంటాయి అని మీనా ఇప్పటికే పలుమార్లు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చింది. అయితే మీనా భర్త చనిపోయాక రెండు మూడు నెలలకే ఆమె రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ ఎన్నో వార్తలు మీడియాలో చక్కర్లు కొట్టాయి.

Cine Critic Sensational Comments On Meena

ఇక ఈ వార్తలపై మీనా, మీనా కూతురు ఇద్దరు స్ట్రాంగ్ కౌంటర్లు ఇచ్చి ఎమోషనల్ గా మాట్లాడినా కూడా మీనాపై రెండో పెళ్లి వార్తలు ఆగడం లేదు.అంతే కాదు మీనా రెండో పెళ్లి చేసుకోబోయేది ధనుష్ ని అని, కిచ్చా సుదీప్ ని అని ఇలా ఎన్నో వార్తలు మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే తాజాగా సినీ ఇండస్ట్రీ వాళ్ల గురించి ఎన్నో వివాదాస్పద కామెంట్లు చేస్తూ వివాదాస్పద సినీ క్రిటిక్ గా పేరు తెచ్చుకున్న సంతోష్ వర్కి సంచలన కామెంట్లు చేశారు. (Meena)

Also Read: Varalaxmi Sarathkumar: 34 ఏళ్ల‌లో పిల్ల‌ల్ని క‌నాల‌నుకున్నా.. ఆ ఒక్క త‌ప్పుతో మొత్తం చెడిందంటూ వ‌ర‌ల‌క్ష్మి షాకింగ్స్ కామెంట్స్‌!

ఆయన ఓ ఇంటర్వ్యూలో నేను మీనాని రెండో పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నాను. మీనా కి పాప ఉన్నా పర్వాలేదు.ఆమెని రెండో పెళ్లి చేసుకొని ఆమెకు మంచి లైఫ్ ని ఇస్తాను అంటూ సంచలన కామెంట్లు చేశారు. ప్రస్తుతం సంతోష్ వర్కి చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవ్వడంతో చాలామంది మీనా అభిమానులు ఆయనపై దుమ్మెత్తి పోస్తున్నారు.అంతేకాదు మీనా అతనిపై యాక్షన్ తీసుకోవాలని కూడా ఫైర్ అవుతున్నారు.

Cine Critic Sensational Comments On Meena

మరి మీనా సంతోష్ వర్కి కామెంట్ లపై ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి. ఇక సంతోష్ వర్కి ఇప్పటికే నిత్యమీనన్ విషయంలో వివాదాస్పద కామెంట్లు చేశాడు. ఆరు సంవత్సరాల నుండి తనని పెళ్లి చేసుకుంటానని వెంటపడి టార్చర్ చేస్తున్నాడంటూ నిత్య మీనన్ చెప్పడంతో అందరూ ఈయనను తిట్టడంతో చివరికి నిత్యమీనన్ కి క్షమాపణలు చెప్పారు.(Meena)

Join WhatsApp