Comedian Ali Reveals His Past Love Story

Ali: కమెడియన్ ఆలీ అంటే తెలియని తెలుగు సినీ ప్రియులు ఉండరు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన ఆలీ.. ఆ తర్వాత స్టార్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. 1000కు పైగా చిత్రాల్లో నటించి తెలుగువారి హృదయాల్లో చెరగని ముద్ర వేశాడు. సుధీర్ఘ సినీ ప్రయాణంలో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నాడు. ఇప్పటికీ వరుస చిత్రాలతో నటుడిగా బిజీ షెడ్యూల్ ను మెయింటైన్ చేస్తున్నాడు. అలాగే బుల్లితెరపై సక్సెస్ ఫుల్ వ్యాఖ్యాతగా సత్తా చాటుతున్నాడు.

Comedian Ali Reveals His Past Love Story

ఆలీ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. జుబేదాతో ఆయన వివాహం జరిగింది. వీరిది పెద్దలు కుదిర్చిన పెళ్లి. ఈ దంపతులకు ముగ్గురు సంతానం. పెద్ద కుమార్తె ఫాతిమా ఇటీవలే పెళ్లి చేసుకుని ఫారెన్ లో సెటిల్ అయింది. అలాగే రెండో కుమార్తె జుబేరియా మరియు కుమారుడు మహమ్మద్ భాషా చదువుకుంటున్నారు. ఆలీ సతీమణి జుబేదా యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారు. కెరీర్ మరియు ఫ్యామిలీ విషయాలు పక్కన పెడితే.. ఆలీకి గతంలో ఒక లవ్ స్టోరీ ఉందని బహుశా చాలామందికి తెలియదు.

వివాహానికి ముందే ఆయన ఒక అమ్మాయిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించారు. కానీ వీరి ప్రేమ విఫలం అయింది. ఆలీ ప్రేమించిన అమ్మాయి ఇండస్ట్రీకి చెందిన వారు అనుకుంటే పొరపాటే అవుతుంది. వాస్తవానికి ఆలీ తన పక్కింటి అమ్మాయిని ప్రేమించాడు. ఆమె కూడా ఆలీని ఇష్టపడింది. కొంతకాలం ఇద్దరు ప్రేమలో మునిగి తేలారు. ఓసారి వర్షం పడుతున్న సమయంలో ఆలీ గొడుగు కొనుక్కుని మ‌రీ ఆమెకు తీసుకెళ్లి ఇచ్చాడట. ఇక ఆమెనే పెళ్లి చేసుకోవాలని ఆలీ భావించాడు.(Ali)

Also Read: Prabhas: ప్ర‌భాస్ పై ప్రేమ పుకార్లు.. అనుష్కతో స‌హా డార్లింగ్ లిస్ట్ లో ఎంత మంది హీరోయిన్లు ఉన్నారో తెలుసా?

కానీ అందుకు ఆలీ తల్లి అంగీకరించలేదు. ఆలీ ప్రేమించిన అమ్మాయిని కోడలుగా ఒప్పుకోలేదు. తల్లికి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవడానికి ఆలీ మొగ్గు చూపులేదు. ఈ క్రమంలోనే తల్లి కోసం ప్రేమించిన అమ్మాయిని ఆలీ వదులుకున్నారు. అలా ఆయ‌న లవ్ ఫెయిల్ అయింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆలీ స్వయంగా తన పాస్ట్ లవ్ స్టోరీ గురించి బయటపెట్టారు. ఇక లవ్ ఫెయిల్ అయిన కొన్నాళ్ల తర్వాత తల్లి జుబేదాతో ఆలీకి వివాహం జరిపించారు.

Join WhatsApp