Crazy record in Mahesh Babu's career

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా నటించిన చిత్రం గుంటూరు కారం మూవీ సంక్రాంతి బరిలో విడుదలై ప్రేక్షకులను మెప్పించ లేకపోయిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ మిక్స్డ్ టాక్ సంపాదించుకుంది. ఈ మూవీలో మహేష్ సరసున శ్రీ లీలా మరియు మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించారు. కథ రొటీన్ గా ఉండడంతో ఈ మూవీ పెద్దగా ప్రేక్షకుల్లోకి వెళ్ళలేక.

Crazy record in Mahesh Babu’s career

ఇక ఒక ఫ్లాప్ తో ఉన్న మహేష్ నెక్స్ట్ మూవీ భారీ హిట్ అయితేనే కానీ మహేష్ కి కెరీర్ ఉండదని ఆలోచించి రాజమౌళితో సినిమాకి ఓకే చెప్పాడు మహేష్. ఇప్పటికే ఈ మూవీ ని అఫీషియల్ గా ప్రకటించారు. ఇక మహేష్ నటించిన గుంటూరు కారం సినిమా హిట్ అవ్వకపోయినా అందులో సాంగ్స్ మాత్రం ఫుల్ క్రేజ్ దక్కించుకున్నాయి.

Also Read: Trisha: ప్రభాస్ తో మరోసారి జతకట్టనున్న త్రిష.. డైరెక్టర్ ఎవరంటే..!

ఈ మూవీలో కుర్చీ మడత పెట్టి సాంగ్ ఎంత పాపులర్ అవుతుందో మనందరం చూస్తూనే ఉన్నాం. ఓ ఊపు ఊపేస్తుంది ఈ సాంగ్. ఈ సాంగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది కూడా. ఎక్కడ చూసినా ఇదే పాట వినిపిస్తుంది. సినిమా విడుదల అయ్యి ఇన్ని నెలలు అయినప్పటికీ ఈ సాంగ్ మాత్రం మర్చిపోవడం లేదు ప్రేక్షకులు. దేశవ్యాప్తంగా కుర్చీ మడత పెట్టి సాంగ్ మాత్రం వినిపిస్తూనే ఉంది.

Crazy record in Mahesh Babu's career

ఇక ఇప్పుడు ఈ సాంగ్ అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. అమెరికా హూస్టన్ లో జరిగే సెన్సేషనల్ బాస్కెట్ బాల్ గేమ్స్ లోను కుర్చీ మడతపెట్టి సాంగ్ మారు మోగింది. ఈ సాంగ్ కి స్టెప్పులు వేసి ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నారు. ఇక ఇప్పుడు ఇంటర్నేషనల్ మోటర్ స్మార్ట్ కంపెనీ తమ కొత్త కారును లాంచ్ చేసింది. తమ బ్రాండ్ న్యూ కారును లాంచ్ చేసి ఆ వీడియోకి కుర్చీ మడత పెట్టి సాంగ్ను యాడ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది.(Mahesh Babu)

Join WhatsApp