Deepika Padukone Enter Into A Home Furnishings Business

Deepika Padukone: బాలీవుడ్ అగ్రతారాల్లో దీపికా పదుకొనే ఒకరు. సుదీర్ఘ కాలం నుంచి స్టార్ హీరోయిన్ గా సత్తా చాటుతున్న దీపికా.. తాజాగా కొత్త‌ బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. సినీ తారలు వ్యాపారాలు చేయడం కొత్తమీ కాదు. చాలామంది నటీనటులు ఓవైపు యాక్టింగ్ కెరీర్ కొనసాగిస్తూనే.. మరోవైపు బిజినెస్ రంగంలో దూసుకుపోతున్నారు. దీపికా పదుకొనే సైతం ఇప్పటికే పలు వ్యాపారాల్లో సత్తా చాటుతోంది. ఇక తాజాగా హోమ్ ఫర్నీషింగ్ బిజినెస్ లోకి అడుగుపెట్టింది.

Deepika Padukone Enter Into A Home Furnishings Business

అమెరికన్ లేబుల్ పోటరీ బార్న్‌తో క‌లిసి దీపికా ప‌దుకొనే డిజైన్ ప్రపంచంలోకి ప్రవేశించింది. ఈ సంస్థ గృహాలంకరణకు ఎంబ్రాయిడరీ చేసిన దిండ్లు, చేతితో ముడిపడిన రగ్గులు, సొగసైన చెక్క ఫర్నిచర్, షాన్డిలియర్స్, కుషన్ డెకర్, డిన్నర్‌వేర్‌లు.. ఇలా వివిధ రకాలైన వస్తువులను విక్ర‌యిస్తోంది. పాటరీ బార్న్ (Pottery Barn) ఇండియా వెబ్ సైట్ లో మీరు ఈ వ‌స్తుల‌ను కొనుగోలు చేయ‌వ‌చ్చు.

Deepika Padukone Enter Into A Home Furnishings Business

అయితే దీపికా పదుకొనే ప్రారంభించిన‌ ఈ కొత్త ఫర్నీచర్ బిజినెస్ లో ధ‌రలు మాత్రం సామాన్యుల‌కు అంద‌నంత ఎత్తులో ఉన్నాయి. పాటరీ బార్న్ ఇండియా వెబ్ సైట్ లో ఒక క్యాండిల్ సెట్ ధ‌ర రూ. 3,000 ఉంది. అలాగే పెర్షియన్-శైలి రగ్గు అక్ష‌రాల‌ రూ. 3,95,000. అంతేకాద‌కుండా 8 డ్రాయర్ల వెడల్పు గల డ్రస్సర్ ధ‌ర రూ. 2,50,000, కింగ్ సైజ్ కేన్ బెడ్ ధ‌ర రూ. 2,30,000, మెటల్ రౌండ్ షాన్డిలియర్ ధ‌ర రూ. 1,70,000, ఐర‌న్ రాడ్‌ షాన్డిలియర్ ధ‌ర‌ రూ. 1,00,000గా ఉన్నాయి.(Deepika Padukone)

Also Read: Varalaxmi Sarathkumar: 34 ఏళ్ల‌లో పిల్ల‌ల్ని క‌నాల‌నుకున్నా.. ఆ ఒక్క త‌ప్పుతో మొత్తం చెడిందంటూ వ‌ర‌ల‌క్ష్మి షాకింగ్స్ కామెంట్స్‌!

ఈ రేట్లు చూసి ఒక్కొక్క‌రికీ దిమ్మ‌తిరిగిపోతుంది. సెలబ్రిటీలు త‌మ ల‌గ్జ‌రీ ఇళ్ల కోసం మాత్రమే వీటిని కొనేలా ధ‌ర‌లు ఉన్నాయ‌ని సామాన్యులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. పాటరీ బార్న్ కు 2022లో దీపికా బ్రాండ్ అంబాసిడర్ అయింది. కొన్ని నెలల తర్వాత ఇండియాలోనూ ఈ బ్రాండ్ ను లాంచ్ చేశారు. కాగా, దీపికా ప‌దుకొనే ప్ర‌స్తుతం ప్రెగ్నెంట్ అన్న విష‌యం తెలిసిందే. దీపికా పదుకొనే, రణవీర్ సింగ్ దంప‌తులు ఇటీవ‌లె త‌మ ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేశారు. త్వ‌ర‌లోనే ఈ జంట త‌మ ఫ‌స్ట్ చైల్డ్ కు వెల్క‌మ్ చెప్ప‌బోతున్నారు.

Join WhatsApp