Deepika Padukone loves that hero

Deepika Padukone: బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే ముందుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది మాత్రం సౌత్ ఇండస్ట్రీ నుండే.ఈమె తమిళ సినిమా ద్వారా సినిమాల్లోకి వచ్చి ఆ తర్వాత బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ అయింది. అయితే సినిమాల్లోకి వచ్చిన కొత్తలో ఈమె తన రంగు కారణంగా ఎన్నో ట్రోల్స్ కి గురైందట.కానీ ఇప్పుడు ఆమెని అభిమానించే వాళ్ళు తప్ప ట్రోల్స్ చేసేవారు లేరు.

Deepika Padukone loves that hero

అయితే దీపికా పదుకొనే సినిమాల కంటే ఎక్కువగా లవ్ ఎఫై ద్వారానే చాలా ఇబ్బందులు పడిందట.మరీ ముఖ్యంగా దీపికా పదుకొనే బాలీవుడ్ హీరో రణ్బీర్ కపూర్ తో ప్రేమ బ్రేకప్ తర్వాత చాలా డిప్రెషన్ లోకి వెళ్లిందట. ఒకానొక సమయంలో సూసై కూడా చేసుకోవాలని అనుకుందని ఇప్పటికే ఎన్నో ఇంటర్వ్యూలలో ఈ ముద్దుగుమ్మ బయటపెట్టింది.(Deepika Padukone)

Also Read: Heroine: 17 ఏళ్లకే రహస్యంగా పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

అయితే ఎట్టకేలకు గతం తరుపు జ్ఞాపకాలను వదిలేసి మళ్లీ బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ తో ప్రేమలో పడి ఆయనను పెళ్లి చేసుకుంది.ఇక త్వరలోనే ఈ జంట ఒక బుల్లి పాపకు జన్మనివ్వబోతోంది. ఈ మధ్యనే ఈ జంట తమ ప్రేగ్నెన్సీ ని కన్ఫర్మ్ చేశారు. ఇదంతా పక్కన పెడితే.. దీపిక పదుకొనేకి తన భర్త రణ్వీర్ సింగ్ కంటే ఆ హీరోనే ఇష్టమట.

Deepika Padukone loves that hero

అంతే కాదు బెడ్ రూమ్ నిండా ఆ హీరో ఫోటోలతోనే నింపేసుకుందట. ఇక ఆ హీరో ఎవరో కాదు హాలీవుడ్ స్టార్ హీరో లియోనార్డో డికాప్రియో.. ఈ హీరో అంటే దీపికా కి పిచ్చి ఇష్టమట.అంతే కాదు తన ఫస్ట్ క్రష్ కూడా ఆ హీరోనే అని చెప్పింది. ఇక లియోనార్డో డికాప్రియో కేవలం దీపికకు మాత్రమే కాదు ఆమె చెల్లికి కూడా ఫేవరెట్ హీరో నట. ఇక ఈ విషయాన్ని స్వయంగా దీపికా పదుకొనేనే ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది.(Deepika Padukone)

Join WhatsApp