Devi Sri Prasad Break up story

Devi Sri Prasad: మ్యూజిక్ డైరెక్టర్ గా సౌత్ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న దేవి శ్రీ ప్రసాద్ 40 ఏళ్లు దాటినా కూడా ఇంకా పెళ్లి చేసుకోవడం లేదు. అయితే దీనికి ప్రధాన కారణం దేవిశ్రీప్రసాద్ ఆ హీరోయిన్ల ను ప్రేమించి మోసపోవడమే అంటారు కొంతమంది ఇండస్ట్రీ జనాలు. అయితే అప్పుడప్పుడు దేవిశ్రీప్రసాద్ పెళ్లి వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొట్టినప్పటికీ అవి ఏవి నిజం కావడం లేదు. ఇక దేవిశ్రీప్రసాద్ ప్రేమించిన అమ్మాయి అనే వార్త రాగానే అందరికీ ఛార్మి మాత్రమే గుర్తుకొస్తుంది.

Devi Sri Prasad Break up story

చార్మి డిఎస్పీ ల ప్రేమాయణం అప్పట్లో టాలీవుడ్ లో హాట్ టాపిక్.. వీరిద్దరూ చాలా రోజులు డేటిం** కూడా చేశారనే టాక్ టాలీవుడ్ లో వినిపించింది. కానీ అనూహ్యంగా వీరిద్దరి మధ్యలోకి పూరి జగన్నాథ్ ఎంటర్ అవ్వడంతో వీరి ప్రేమ పెటాకులైందని చార్మి పూరితో క్లోజ్ గా ఉండడం దేవి శ్రీ ప్రసాద్ కి నచ్చక ఛార్మికి బ్రేకప్ చెప్పారట.అయితే చార్మి తర్వాత దేవిశ్రీప్రసాద్ మరో హీరోయిన్ ని ప్రేమించారట.కానీ ఆ హీరోయిన్ తో బ్రేకప్ అవ్వడానికి కారణం త్రివిక్రమ్ అని తెలుస్తోంది.ఆమె ఎవరో కాదు ప్రణీత.. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ప్రణీత,సమంతలు హీరోయిన్స్ గా చేశారు. (Devi Sri Prasad)

Also Read: Keerthy Suresh: ఆ నైట్ రణ్ వీర్ తో ఆమె బాగా ఎంజాయ్ చేసిందంటూ సీక్రెట్ లీక్ చేసిన కీర్తి సురేష్..!

అయితే ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా దేవి శ్రీ ప్రసాద్ చేశారు. ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలో ప్రణీత డిఎస్పీల మధ్య ప్రేమ చిగురించిందట. అయితే అప్పటికే మోసపోయిన డిఎస్పి ప్రణీతతో అలా జరగకూడదు అనుకున్నారట. కానీ ప్రణీత , త్రివిక్రమ్ మధ్య ఓ సీక్రెట్ సంబంధం ఉందనే విషయం బయటపడిందట. త్రివిక్రమ్ తన సినిమాలో చేసిన చాలామంది హీరోయిన్లతో సంబంధం పెట్టుకుంటారనే టాక్ ఉంది. అలా ప్రణీత తో కూడా ఈ టాక్ వినిపించింది. అయితే ప్రణీత కి త్రివిక్రమ్ చేయబోయే నెక్స్ట్ సినిమాలో హీరోయిన్ అవకాశం ఇస్తానని వేరే హీరోయిన్ ని తీసుకున్నారట.

Devi Sri Prasad Break up story

దాంతో ప్రణీత మీరు నన్ను ఆ సినిమాలో హీరోయిన్ గా తీసుకుంటానని మోసం చేశారు. ఆ సినిమాలో వేరే హీరోయిన్ ని తీసుకున్నారు కాబట్టి మీరు నాకు మూడు కోట్లు ఇవ్వకపోతే మీ సీక్రెట్ ఫొటోస్ అన్నీ బయటపెడతాను అంటూ బెదిరించిందట. దాంతో త్రివిక్రమ్ మూడు కోట్లు ప్రణీతకి ఇచ్చి సెటిల్ చేయడంతో ఈ వ్యవహారం కాస్త ఇండస్ట్రీలో వైరల్ అయ్యి అది కాస్త దేవిశ్రీప్రసాద్ చెవిన పడిందట. దాంతో వీరి ప్రేమ కూడా బ్రేకప్ అయిందని తెలుస్తోంది. అలా దేవిశ్రీ ప్రసాద్ ఇద్దరు హీరోయిన్ల చేతిలో దారుణంగా మోసపోయారట.(Devi Sri Prasad)

Join WhatsApp