Did Anushka Became Star Heroine Because of those Bollywood Heroine's

Anushka: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఒకప్పుడు ఇండస్ట్రీలో రాణించిన అనుష్క కేవలం టాలీవుడ్ లోనే కాకుండా సౌత్ లోనూ మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్.ఈమె సీనియర్ హీరోయిన్ అయినప్పటికీ కూడా ఇప్పటికీ అవకాశాలు మాత్రం తగ్గడం లేదు. ఈ మధ్యనే యంగ్ హీరోయిన్ నవీన్ పోలిశెట్టితో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే మూవీ ద్వారా అభిమానుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే.

Did Anushka Became Star Heroine Because of those Bollywood Heroine’s

ఈ సినిమా థియేటర్స్ లో విడుదలై ఓకే టాక్ తెచ్చుకుంది. అయితే అనుష్క హీరోయిన్ అవ్వడానికి చాలామంది సోనూసూద్ లేదా పూరి జగన్నాథ్, నాగార్జున,భూమిక భర్త భరత్ ఠాకూర్ అని అందరూ అనుకుంటారు. కానీ అనుష్క హీరోయిన్ అవ్వడానికి వీరందరూ కాకుండా మరో హీరోయిన్ కారణమైందట. మరి ఆ హీరోయిన్ ఎవరు.. నిజంగానే ఆ హీరోయిన్ వల్లే అనుష్క స్టార్ గా మారిందా అనే సంగతి ఇప్పుడు తెలుసుకుందాం.(Anushka)

Also Read: Mohan Babu: మోహన్ బాబు చేతిలో దెబ్బలు తిన్న స్టార్ హీరోయిన్.. ఎందుకంటే..?

ఇక అనుష్క హీరోయిన్ అవ్వడానికి కారణం బాలీవుడ్ నటి అయిన సోనాలి బింద్రే అని తెలుస్తోంది. ఎందుకంటే పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ సినిమాలో నాగార్జునకు జోడిగా సెకండ్ హీరోయిన్ గా బాలీవుడ్ నటి అయిన సోనాలి బింద్రేని తీసుకున్నారట మూవీ మేకర్స్. కానీ ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల సోనాలి బింద్రే ఆ పాత్రలో నటించడానికి ఒప్పుకోలేదట.

Did Anushka become a star heroine because of that Bollywood heroine's

అలా సోనాలి బింద్రే సినిమా నుండి తప్పుకోవడంతో ఆమె ప్లేస్ లో కొత్త హీరోయిన్ ని తీసుకుందామని అనుష్కని పెట్టారు పూరి జగన్నాథ్. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో అనుష్కకి మంచి గుర్తింపు వచ్చింది. అంతేకాదు ఈ మూవీలో సెకండ్ హీరోయిన్ అయినప్పటికీ అనుష్కకి వరుసగా అవకాశాలు రావడంతో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.ఇలా పరోక్షంగా అనుష్క హీరోయిన్ అవ్వడానికి సోనాలి బింద్రే కారణం అని చెప్పుకోవచ్చు.(Anushka)

Join WhatsApp