Did Anushka really lift Prabhas in the movie Mirchi

Prabhas: అనుష్క ఈ మధ్యకాలంలో అధిక బరువు పెరిగిపోవడంతో పేదగా సినిమాలు చేయడం లేదు. ఇక అనుష్క ఏ హీరోతో జతకట్టిన యావరేజ్ గా ఉంటుంది కానీ ఒక ప్రభాస్తో జతకడితే మాత్రం చాలా స్పెషల్ గా చూస్తారు. వీరిద్దరి కాంబినేషన్ కి ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉందని చెప్పొచ్చు. ప్రభాస్, అనుష్క కలిసి మూడు సినిమాలు చేశారు. బిల్లా, మిర్చి, బాహుబలి లో నటించి హ్యాట్రిక్ హిట్స్ సొంతం చేసుకున్నారు. టాలీవుడ్ లో ఈ జోడీకి మంచి క్రేజ్ ఉంది. వీరిద్దరి మధ్య పండే కెమిస్ట్రీకి ప్రతి ఒక్కరు ఫీదా అవుతారు. అంతేకాకుండా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారని, డేటింగ్ లో ఉన్నారని పుకార్లు ఎప్పటినుంచో వినిపిస్తూనే ఉన్నాయి.

Did Anushka really lift Prabhas in the movie Mirchi

దీంతో పాటు త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ వార్తలు వినిపించాయి. ఇక వీటిపై ప్రభాస్ మరియు అనుష్క స్పందించి మా మధ్య ఏమీ లేదు.. జస్ట్ అని చెప్పినప్పటికీ ఈ వార్త లకి అడ్డుకట్ట పడలేదు. నిత్యం వీరిపై ఏదో ఒక వార్త సృష్టిస్తూ సంతృప్తి చెందుతున్నారు అభిమానులు. ఇక ఇదిలా ఉంటే ఈ ఇద్దరూ కలిసి నటించిన మిర్చి మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. ఇందులో ప్రభాస్కి మరదలు పాత్రలో అనుష్క నటించింది. విదేశాల నుంచి వచ్చిన ప్రభాస్ కి అన్ని తానై చూసుకునే సీన్లు ఉంటాయి. అందులో భాగంగా ఇద్దరు కలిసి బయటకు వెళ్తారు.

Also Read: Sobhan Babu: శోభన్ బాబు ఆస్తులన్నీ కొడుకులు అమ్మేశారా.. సంచలన విషయం బయటపెట్టిన సీనియర్ హీరో..!

అక్కడ మామిడి కాయలు కోయాల్సి ఉంటుంది. కానీ అవి అందవు. ఇక అప్పుడు అనుష్కని ఎత్తుకునేందుకు వెనకడుగు వేస్తాడు ప్రభాస్. దీంతో అనుష్క ధైర్యం చేస్తుంది. ప్రభాస్ ని ఎత్తుకుంటుంది. ఈ సీన్ మూవీలో హైలెట్గా నిలిచింది. దీనికి ఆడియన్స్ రెస్పాన్స్ కూడా బాగా వస్తుంది. ప్రభాస్ కటౌట్ ని ఎత్తుకోవడం అంటే మామూలు విషయం కాదు. దీనికి ఏదో డూప్ పెట్టి, లేదా డ్రోప్‌ల సహాయంతో చేసి ఉంటారని అంతా భావిస్తారు. కానీ ఈ సీన్ గురించి గతంలో ప్రభాస్ స్పందిస్తూ షాక్ ఇచ్చాడు. మిర్చి టైం ఇంటర్వ్యూలో ప్రభాస్ ఈ విషయాన్ని వెల్లడించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చింది.

Did Anushka really lift Prabhas in the movie Mirchi

ఆ సీన్ మ్యాజిక్ గురించి చెప్పాలని యాంకర్ అడిగింది. ఇక దీనికి స్పందిస్తూ నిజంగానే అనుష్కని తనని ఎత్తుకుందా నీ తెలిపాడు. అయితే ముందు ఈ ఐడియా చెప్పినప్పుడు కొత్తగా ఉందనిపించింది.. అందరూ హీరోయిన్లని ఎత్తుకుంటారు.. ఇది రొటీన్. కానీ ఇది డిఫరెంట్ గా నన్ను అనుష్క ఎత్తుకుంది. అయితే ఇందులో చిన్న ట్రిక్‌ని ఉపయోగించారట. ఈ విషయాన్ని ప్రభాస్ తెలిపారు. ఫస్ట్ చిన్న కుర్చీ వేశారట దానిపై తాను నిలబడ్డాడట. దీంతో అనుష్కని తనని అలా గట్టిగా పట్టుకుందట. ఇక వెంటనే కుర్చీ తీసేశారు. ఆ గ్యాప్ లో షూటింగ్ చేశారు.. అని ప్రభాస్ తెలిపారు. ప్రస్తుతం ప్రభాస్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(Prabhas)

Join WhatsApp