Did Soundarya 100 crore property finally get to her

Soundarya: దివంగత నటి సౌందర్య ఒకప్పుడు ఎన్నో సినిమాల్లో నటించింది. ఇక ఈమె సినిమాల్లో నటించే సమయంలో చాలామంది హీరోయిన్లు ఈమెకు పోటీగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఈమెకు మాత్రం ప్రత్యేక స్థానం ఉండేది. చాలామంది స్టార్ హీరోలు సైతం సౌందర్యని తమ సినిమాల్లో హీరోయిన్ గా పెట్టుకోవడం కోసం ఒక నెల రోజుల ముందే డేట్స్ ఫిక్స్ చేసి పెట్టుకునే వారట.అంతేకాదు ఒకవేళ సౌందర్య డేట్స్ ఖాళీగా లేకపోతే సినిమా షూటింగ్స్ కూడా వాయిదా వేసుకునేవారట చాలామంది నటీనటులు.

Did Soundarya 100 crore property finally get to her

అయితే అలాంటి సౌందర్య ఆకస్మిక మరణం ఎంతో మందిని కలిచివేసింది. ఈమె చనిపోయిన సమయంలో ఇండస్ట్రీ మొత్తం కన్నీళ్లు పెట్టింది.అభిమానులైతే ఎంతలా బాధపడ్డారో చెప్పనక్కర్లేదు. అయితే అలాంటి సౌందర్య సినిమాల ద్వారా దాదాపు వందల కోట్ల ఆస్తులు సంపాదించింది. ఇక సౌందర్య సంపాదించిన ఆస్తులన్నీ చివరికి ఆమెకి దక్కాయట అంటూ ఇండస్ట్రీలోని కొంతమంది మాట్లాడుకుంటున్నారు. ఇక ఆమె ఎవరంటే.. సౌందర్య రఘు అనే అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. (Soundarya)

Also Read: Rashmika: రష్మిక లవ్ చేసిన మొదటి తెలుగు హీరో.. విజయ్ దేవరకొండ అయితే కాదు.. ఎవరంటే..?

ఇక పెళ్లయిన సంవత్సరానికే సౌందర్య మరణించింది. సౌందర్య పెళ్ళి 2003లో జరిగితే ఆమె 2004లో మరణించింది. అయితే సౌందర్య తన పెళ్లయ్యాక చాలా వరకు ఆస్తులను తన భర్త పేరు మీద రాసేసిందట. కానీ ఆమె ఇలా ఆకస్మిక మరణం పొందుతుంది అనే విషయం తెలియదు కదా.. అయితే ఆమె మరణించాక ఆమెపై కొన్ని రూమర్స్ పుట్టుకొచ్చాయి.సౌందర్య ఆస్తి మొత్తం వీలునామాలో వేరే పేరు పై రాసిందని, కానీ ఆ వీలునామని దాచేసి అత్తింటి వాళ్ళు పుట్టింటి వాళ్ళు ఆస్తులు పంచేసుకున్నారనే వార్తలు వినిపించాయి.

Did Soundarya 100 crore property finally get to her

కానీ ఈ వార్తలపై సౌందర్య తల్లి రియాక్ట్ అయ్యి నా కూతురు చిన్న వయసులోనే చనిపోతుందని ఏమైనా ఊహించిందా..ఆమె ఎందుకు వీలునామా రాస్తుంది అని ఘాటుగా కౌంటర్ ఇచ్చింది. అయితే సౌందర్య ఆస్తి గురించి భర్తకి పుట్టింటి వాళ్లకు ఎన్నో గొడవలు జరిగాయి. చివరికి కోర్టు దాకా వెళ్ళింది. కానీ ఆ తర్వాత కోర్టు బయటే వీరు ఆస్తులు పంచేసుకున్నారు.ఇక సౌందర్య ఎంతో కష్టపడి కోట్ల ఆస్తి సంపాదిస్తే చివరికి అది సౌందర్య భర్త రెండో పెళ్లి చేసుకున్న అపూర్వ అనే అమ్మాయికి చెందిందని.. ప్రస్తుతం సౌందర్య భర్త రఘు గోవాలో సెటిల్ అయ్యాడని రఘు రెండో భార్య అపూర్వ సౌందర్య ఆస్తులను అనుభవిస్తుంది అంటూ కొంతమంది ఇండస్ట్రీ జనాలు మాట్లాడుకుంటున్నారు.(Soundarya)

Join WhatsApp