Did that journalist torture the Savitri

Savitri: మహానటి సావిత్రి పేరు చెబితేనే చాలామంది కన్నీళ్లు పెట్టుకుంటారు. ఎందుకంటే ఆమె ఎన్నో సినిమాల్లో నటించి తన సంపాదనతో కోట్ల ఆస్తులు కూడబెట్టి చివరికి దిక్కులేని స్థితిలో మరణించింది. ఎన్నో ఆస్తులు కొనుగోలు చేసి పెద్దింట్లో ఎన్నో వైభోగాలు అనుభవించిన ఈమె తన తప్పుల కారణంగా చివరికి అద్దెకు తీసుకున్న ఇంట్లో ఉండాల్సి వచ్చింది. అయితే సావిత్రికి అంతటి గతి పట్టడానికి కారణం నమ్మినవాళ్లే.. నమ్మినవాళ్లే మోసం చేసి ఆమెను నిండా ముంచేశారు.

Did that journalist torture the Savitri

చివరికి దిక్కులేని దానిలాగా మరణించింది. అయితే అలాంటి సావిత్రి పై పగతో ఓ జర్నలిస్టు సావిత్రి ని కొట్టించారట.మరి ఆయన ఎవరు.. ఎందుకు అంత పగ పెంచుకున్నారు అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. మహానటి సావిత్రి పై పరమేశ్వర అనే జర్నలిస్టు ఓ విషయంలో గొడవపడ్డారట. దాంతో ఆ విషయంలో ఈగోకి పోయిన పరమేశ్వర సావిత్రి పర్సనల్ లైఫ్ లోకి వెళ్లి తప్పుడు రాతలు రాశారట.(Savitri)

Also Read: Sridevi Vijaykumar: పెళ్లి త‌ర్వాత కెరీర్ నాశ‌నం.. అందుకే సినిమాలు మానేశానంటూ నిజాలు బ‌య‌ట‌పెట్టిన శ్రీ‌దేవి!

దాంతో సావిత్రి చాలా రోజులు కోర్టు చుట్టు తిరగాల్సి వచ్చిందట. ఇక చివరికి కోర్టు లో ఆ కేసు సాల్వ్ అయినప్పటికీ అప్పటికే సావిత్రి లైఫ్ డామేజ్ అయిపోయిందట.దాంతో చాలామంది ఆమెను ఎన్నో బూతులు తిట్టడమే కాకుండా రాళ్లతో కొట్టడానికి కూడా ప్రయత్నించారట.అలా తన పర్సనల్ లైఫ్ లో లేనివి ఉన్నట్లు కల్పించి రాయడం కారణంగా సావిత్రి ఆ జర్నలిస్టు వల్ల చాలా ఇబ్బంది పడిందట.

Did that journalist torture the Savitri

ఇక ఈ విషయాన్ని స్వయంగా ఇండస్ట్రీలో పీపుల్స్ లీడర్ గా పేరు తెచ్చుకున్న ఆర్ నారాయణ మూర్తి రీసెంట్ గా ఓ కార్యక్రమంలో అందరితో పంచుకున్నారు. మీడియాకి,జర్నలిస్టులకి మంచి పవర్ ఉంటుంది. అలాంటి పవర్ ని మంచి పనులకు ఉపయోగించుకోవాలి. సినిమా వాళ్ళ పర్సనల్ విషయంలోకి వెళ్లి లేనిది ఉన్నట్లు తప్పుడు రాతలు రాసి వారిని బజారులోకి తీసుకురావద్దు మీకు చేతులెత్తి నమస్కారం చేస్తాను అంటూ చెప్పుకొచ్చారు.(Savitri)

Join WhatsApp