Differences between Vijay Sangeetha..Is that the reason

Vijay-Sangeetha: కోలీవుడ్ హీరో విజయ్ తన భార్యతో విడాకులు తీసుకోబోతున్నారు అని గత రెండు సంవత్సరాల నుండి కొన్ని వార్తలు కోలీవుడ్ మీడియాలో హల్చల్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇక వీరి విడాకులకు కారణం విజయ్ వేరే హీరోయిన్లతో రిలేషన్ పెట్టుకోవడమే అని, అందుకే సంగీత భర్త నుండి దూరంగా ఉంటుంది అంటూ ఎన్నో రూమర్స్ మీడియాలో వినిపిస్తున్నాయి.

Differences Between Vijay & Sangeetha. Is that the Reason

అయితే విజయ్ సంగీత మధ్య విభేదాలు వచ్చి విడాకులు తీసుకుంటున్నారని వార్తలు రావడానికి ప్రధాన కారణం విజయ్ వేరే హీరోయిన్స్ తో రిలేషన్ లో ఉండడం కాదట.మరో కారణముందట.ఇక ఆ కారణం ఏదో కాదు విజయ్ పొలిటికల్ ఎంట్రీ.. గత కొద్ది సంవత్సరాలుగా విజయ్ రాజకీయ రంగ ప్రవేశం చేస్తారని వార్తలు వినిపిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ ఏడాది వస్తారు.. వచ్చే ఏడాది వస్తారు..అంటూ విజయ్ పొలిటికల్ ఎంట్రీ పై వార్తలు వస్తున్నాయి తప్ప ఆయన రాజకీయాల్లోకి వచ్చింది లేదు పోయింది లేదు.

Also Read: Lavanya Tripathi: పెళ్లి త‌ర్వాత మెగా ఫ్యామిలీ కండీష‌న్స్‌.. తొలిసారి ఓపెన్ అయిన లావ‌ణ్య త్రిపాఠి!

ఇక రాజకీయాల్లోకి రావాలని విజయ్ కి ఎంతో ఆశగా ఉన్నప్పటికీ ఫ్యామిలీ ఒప్పుకోకపోవడంతో ఆయన వెనకడుగు వేస్తున్నారట. ఈ విషయంలో భార్య సంగీత రాజకీయాల్లోకి వద్దు.. రాజకీయాల్లోకి వెళితే వ్యక్తిగత జీవితం లో ఇబ్బందులు వస్తాయని భయపడే సంగీత వద్దని చెబుతుందట. ఇక వీరి మధ్య విభేదాలు వచ్చి విడాకుల వార్తలు రావడానికి ప్రధాన కారణం కూడా విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇష్యూనే అని తమిళ మీడియా ప్రచారం చేస్తోంది.

 Differences between Vijay Sangeetha..Is that the reason

విజయ్ రాజకీయాల్లోకి వెళ్లడాన్ని భార్య సంగీతతో పాటు కొడుకు కూడా అడ్డుకుంటున్నారట. అందుకే విజయ్ భార్య సంగీత గత రెండు సంవత్సరాల నుండి కూతురి చదువు కోసం లండన్ లోనే ఉంటుంది.ఇక గతంలో అప్పుడప్పుడు లండన్ వెళ్లిన విజయ్ ఇప్పుడు మాత్రం పూర్తిగా లండన్ వెళ్లడమే మానేశారు. దాంతో వీరి మధ్య గత కొద్ది రోజులుగా మాటలు లేవని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. (Vijay-Sangeetha)

Join WhatsApp