"Tollywood Stars' Grand Weddings Take Center Stage"

Dilraju: ప్రస్తుత కాలంలో మన సినీ పరిశ్రమలో పెళ్లిళ్ల హడావిడి ఎక్కువగా కనిపిస్తుంది. 2023లో అనేకమంది స్టార్స్ పెళ్లిళ్లు చేసుకున్నారు. దీంతో వారి అభిమానులు కూడా ఎంతో సంతోషంగా ఫీల్ అయ్యారు. ఇక తాజాగా మన టాలీవుడ్ కి చెందిన మరో హీరో పెళ్లికి రెడీ అయిపోయాడు.

Dilraju: “Tollywood Stars’ Grand Weddings Take Center Stage”

తన పెళ్లికి రావాలంటూ ఓ స్టార్ హీరోకి ఆహ్వానం పంపించాడు కూడా. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరు? పెళ్లి ఏ హీరో ది? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఆ యంగ్ హీరో మరెవరో కాదు ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు మేనల్లుడు. రౌడీ బాయ్స్ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఆశిష్ రెడ్డి పెద్దగా పాపులారిటీ సంపాదించుకోలేకపోయాడు.

Also Read: Health: ఎండు ద్రాక్షాలను ప్రతిరోజు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..!

సినిమా కథాంశం బాగున్నప్పటికీ ప్రేక్షకులు పెద్దగా దానిని ఆదరించలేదు. ఇక దీంతో సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ పెళ్లిపై ధ్యాస పెట్టాడు ఆశిష్. ఇక గత ఏడాది నిశ్చితార్థం కూడా చేసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యాపారవేత్త కూతురు అద్వెత రెడ్డి తో అతనికి ఎంగేజ్మెంట్ జరిగింది. ఇరు కుటుంబాల మధ్య వీరి నిశ్చితార్థం అంగరంగ వైభోగంగా జరిగింది.

"Tollywood Stars' Grand Weddings Take Center Stage"

ఇక కొత్త ఏడాది సందర్భంగా పెళ్లికి రెడీ అయ్యారు ఈ జంట. ఇక పెళ్లి ఎప్పుడు అనేది క్లారిటీ రాకపోయినప్పటికీ ఈ ఏడాదిలో ఉండనున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ పెళ్లికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని ఆహ్వానించారు దిల్ రాజు కుటుంబం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ ఫోటోలను చూసిన తారక్‌ అభిమానులు ఖుషి అవుతున్నారు. అదేవిధంగా నూతన పెళ్లి కొడుకుకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు కూడా.(Dilraju)

Join WhatsApp