Director Anil Ravipudi, who was trolled

Anil Ravipudi: ప్రస్తుత కాలంలో ఏ సెలబ్రిటీ అయినా కొంచెం నోరు జారి చిన్న మాట వదిలేస్తే చాలు.. అది సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతూ ఉంటుంది. వారిని కొంతకాలం పాటు ట్రోల్స్ లో చితక్కొడుతూ ఉంటారు. ఇటువంటి తరుణంలోనే అనిల్ రావిపూడి ఓ చిన్న మాట వదిలేసాడు. ఏ మాట మాట్లాడకూడదు అదే మాట అనేసాడు. ఇంతకాలం కాపాడుకుంటూ వచ్చిన తన పరువును ఒక్క మాటతో గంగలో కలిపేసుకున్నాడు. ఎఫ్2 సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్న అనిల్ రావిపూడి ఇటీవలే బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

Director Anil Ravipudi, who was trolled

ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ని ఊచ కోత కోసిందనే చెప్పుకోవచ్చు. ఇక ప్రస్తుతం అనిల్ రావు పూడి తను తదుపరి చిత్రాన్ని విక్టరీ వెంకటేష్ తో తీయనున్నట్లు కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. కానీ దీనిపై ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం రాలేదు. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఓ మూవీ ప్రమోషన్స్ లో గెస్ట్ గా విచ్చేసిన అనిల్ రావిపూడి ఐపిఎల్ గురించి మాట్లాడుతూ ఘోరమైన వ్యాఖ్యలను చేశాడు. ” ఐపీఎల్ మ్యాచ్లు చూడకపోతే కొంపలు ఏమి మునిగిపోవు. రెండు రోజులు అటు ఇటు అయితే ఏం పర్లేదు. సో సినిమాలకి రండి ఈవెనింగ్ టైం ఫస్ట్ షో అండ్ సెకండ్ షోలకి ” అంటూ కామెంట్స్ చేశాడు అనిల్ రావిపూడి.

Also Read: Mahesh Babu: పాన్ ఇండియా సినిమాలు తీయకముందే టాప్ హీరోలలో సెకండ్ ప్లేస్ కొట్టేసిన మహేష్.. చిరంజీవికి ఘోర అవమానం..!

ప్రస్తుతం వీటిని పట్టుకుని ఐపిఎల్ కి మీనింగ్ తెలీని ఎదవలు కూడా మాట్లాడుతున్నారు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అదేవిధంగా..” సినిమాలు చూడకపోయినా కొంపలు ఏమి మునిగిపోవు. అయినా మీ సినిమాలు ఐ బొమ్మ లేదా టెలిగ్రామ్, అమెజాన్, జియో సినిమా.. ఈ విధంగా మొబైల్ లో కూడా ఇంట్లో కూర్చుని సినిమా చూడవచ్చు. అండ్ ఐపీఎల్ గురించి మాట్లాడారు. ఐపీఎల్ అంటే స్కోర్ చూసినప్పుడు ఒకలా ఉంటుంది డైరెక్ట్ గా లైవ్ చూసినప్పుడు ఇంకోలాగా ఉంటుంది.

Director Anil Ravipudi, who was trolled

వాళ్లు కొట్టేటువంటి కొట్టుడకు మరియు మ్యాచ్ సాగేటువంటి ఉత్సాహానికి.. చేజింగ్ అండ్ సీజింగ్ కి నువ్వు తీసే గ్రింజ్ సినిమాలకంటే ఈ ఐపీఎల్లో డబల్ అండ్ టైన్మెంట్ వస్తుంది. నీ సినిమాని లేపుకో. మా సినిమాని చూడండి అంటూ బ్రతిమలాడుకో. కానీ ఐపీఎల్ చూడక పోతే ఏం మునిగిపోదు.‌.. అంటూ కామెంట్స్ చేయకు. అయినా మేము ఏం చూడాలో కూడా నువ్వే చెబుతావా? ఐపీఎల్ అంటే ఎఫ్2 ఎఫ్3 తీసినట్లు అనుకుంటున్నావా? ఒకసారి వెళ్లి ఒక బాలు ఆడు ఎలా ఉంటుందో తెలుస్తుంది ” అంటూ గోరంగా ట్రోల్స్ కి గురి చేస్తున్నారు ట్రోలర్స్.(Anil Ravipudi)

Join WhatsApp