Director Prashant Verma has that talent too

Prashant Verma: 2024లో రిలీజ్ అయిన సినిమాలలో పెద్ద సెన్సేషన్ సృష్టించిన మూవీ ” హనుమాన్ “. చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ మూవీ భారీ విజయాన్ని దక్కించుకుంది. తేజ సజ్జ హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాకి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించాడు. ఇక సాధారణంగా సినిమా హిట్ అయితే హీరో లేదా హీరోయిన్ మీద ఎక్కువ ప్రశంసలు కురిపిస్తూ ఉంటారు.

Director Prashant Verma has that talent too

అదేవిధంగా వారికి ఎక్కువ ఫాలోయింగ్ కూడా దక్కుతుంది. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం మొత్తం డిఫరెంట్ గా ఉంది. సినిమా హిట్ అయిన అనంతరం అందరూ ప్రశాంత్ వర్మపై పడ్డారు. ఈ సినిమాలో నటించిన తేజ సజ్జ మరియు అమృత అయ్యర్ గురించి ఎవ్వరూ పట్టించుకోలేదు. అమ్మాయిలందరూ కూడా ప్రశాంత్ వర్మని క్రష్ గా భావించారు. ఈ క్రమంలోనే ఈయన పేరుని ఓ రేంజ్ లో సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు. అంతేకాకుండా ప్రశాంత్ వర్మ గురించి మరిన్ని విషయాలు ఆరా తీశారు కూడా.

Also Read: Balayya: బాలయ్య సినిమాలో ఛాన్స్ కొట్టేసిన బేబీ బ్యూటీ.. ఇక దిస మారినట్లేగా..!

ఇక ఈ క్రమంలోనే ప్రశాంత్ వర్మ గురించి ఓ సూపర్ టాలెంట్ ఒకటి బయటకు వచ్చింది. ఇక ఈ క్రమంలోనే లేటెస్ట్ గా ఈయన బ్యాక్ టు ప్రాక్టీస్ అని తన సోషల్ మీడియాలో నెట్ లో క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియో ఒకటి పోస్ట్ చేశాడు. ఇక దీంతో ప్రశాంత్ వర్మ ఒక్క డైరెక్టరే కాదు క్రికెటర్ కూడా అని ప్రతి ఒక్కరికి అర్థమైంది. ఇక ఓ ఇంటర్వ్యూలో సైతం ప్రశాంత్ వర్మ తనకి క్రికెట్ అంటే ఇష్టమని స్కూల్ డేస్ లో బాగా ఆడేవాడని తెలియజేశాడు. ఇక ఈయన స్కూల్ టోర్నమెంట్స్ తో పోటీగా డిస్టిక్ లెవెల్ మ్యాచ్లను కూడా ఆడాడట.

Director Prashant Verma has that talent too

బౌలింగ్ అండ్ బ్యాటింగ్ చేస్తూ తన ఆల్ రౌండర్ ప్రదర్శనతో ప్రతి ఒక్క ప్రేక్షకుడిని మెప్పించాడు ప్రశాంత్ వర్మ. ఇక సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో కూడా ప్రశాంత్ వర్మ భాగం అయ్యాడు. సినిమా షూట్ కంప్లీట్ అయిన అనంతరం ప్రతిరోజు ఈయన క్రికెట్ ఆడతాడట. ఇక ఓ మ్యాచ్ లో ప్రశాంత్ వర్మ విన్ అయ్యాడు కూడా. ఇక ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ క్రమంలోనే ప్రశాంత్ వర్మ ఒక్క డైరెక్టరే కాదు విరాట్ కోహ్లీ కూడా అంటూ కామెంట్స్ చేస్తున్నారు ప్రేక్షకులు.(Prashant Verma)

Join WhatsApp