natural star nani

Natural Star Nani: తెలుగు లో న్యాచురల్ స్టార్ గా పేరున్న నాని తన సహజమైన నటనతో ఎంతో మందిని తన అభిమానులుగా మార్చుకున్నాడు. మంచి సినిమాలతో అలరిస్తూ హిట్ లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా ఫాలోయింగ్ పెంచుకుంటున్న నాని ప్రస్తుతం సరిపోదా శనివారం సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. ఈ సినిమా ను త్వరలోనే విడుదల చేయబోతున్న నాని ఆ తర్వాత ఎవరితో సినిమా చేస్తాడు అన్నా క్లారిటీ ఇంకా ఇవ్వలేదు.

Directors waiting List to Do Movie With Nani

వాస్తవానికి నానితో సినిమా చేయడానికి చాలామంది డైరెక్టర్ లు వెయిటింగ్ లో ఉన్నారు. దసరా తో నాని కి మంచి బూస్ట్ ఇచ్చిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తన రెండో సినిమా ను సైతం నానితోనే చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇక బలగం సినిమా తో చరిత్ర సృష్టించిన వేణు కూడా నాని కోసం ఓ కథ సిద్ధం చేశాడు. ఈ సినిమా ను దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ రెండు సినిమాలే కాక, శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ 3 సినిమా ను కూడా చేయాల్సి ఉంది.

Also Read: Tech Tips: మీ మొబైల్ నంబర్ ని మర్చిపోయారా…? అయితే ఈ ట్రిక్స్‌ తో తెలుసుకోవచ్చు..!

ఇలా ఈ ముగ్గురు దర్శకులు మాత్రమే కాకుండా ఇప్పుడు ఆయనతో సినిమా చేసే దర్శకుల వెయిటింగ్ లిస్టు లో మరో క్రేజీ డైరెక్టర్ కూడా యాడ్ అయ్యాడు. ఆయనే సుజిత్. సాహో సినిమా తో స్టార్ డైరెక్టర్ గా మారిన సుజిత్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో OG సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ను ఆగస్ట్ లో విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా తర్వాత నాని తో ఓ సినిమా చేయడానికి సుజిత్ ప్రయత్నాలు చేస్తున్నాడట.

నాని కోసం ఓ మాఫియా బ్యాక్ డ్రాప్ లో స్టొరీ రెడీ చేసిన సుజిత్ త్వరలోనే నాని కి చెప్పబోతున్నాడట. ఒకవేళ అన్ని సెట్ అయితే ఇది మంచి కాంబో అవుతుందని చెప్పాలి. ఇక నాని సరిపోదా శనివారం సినిమా ను కూడా ఆగస్ట్ లోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు.

Join WhatsApp