Disha Patani dress cost

Disha Patani: దిశా పటాని.. బాలీవుడ్ బ్యూటీ అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమైన హీరోయినే..ఈమె మెగా బ్రదర్ నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ హీరోగా చేసిన లోఫర్ మూవీలో హీరోయిన్గా నటించింది.ఈ సినిమాలో తన అందచందాలతో తన హైట్ తో ఎంతోమంది కుర్ర కారును పడగొట్టేసింది.అయితే ఈ సినిమా ప్లాఫ్ అవ్వడంతో దిశాపటానీ కి తెలుగులో అవకాశాలు రాలేదని చెప్పుకోవచ్చు. ఇక బాలీవుడ్లో ఈ ముద్దుగుమ్మ నటించిన ధోని ది అన్టోల్డ్ స్టోరీస్ సినిమా హిట్ అవ్వడంతో దిశపటానికి హీరోయిన్గా ఇండస్ట్రీలో కాస్త గుర్తింపు లభించింది.

Disha Patani dress cost

ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898 AD మూవీలో ఒక కీలకపాత్రలో నటిస్తుంది. అయితే ఇందులో మెయిన్ హీరోయిన్ దీపికా పదుకొనే అయినప్పటికీ కూడా ఇందులో ఒక కీలక పాత్రలో దిశా నటిస్తోందట. ఇదిలా ఉంటే తాజాగా దిశా పటానీ వేసుకున్న ఒక డ్రెస్ కు సంబంధించిన ధర ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. మరి దాని ధర ఎంతో ఇప్పుడు చూద్దాం.. దిశా పటాని సినిమాల కంటే ఎక్కువగా తన అఫైర్స్ ద్వారానే బాలీవుడ్లో హాట్ టాపిక్ అయింది.(Disha Patani)

Also Read: Upasna: డిప్రెషన్ లో కూరుకుపోయిన ఉపాసన.. భార్యతో అత్తారింటికి వెళ్లిన చెర్రీ..!

ఈమె గత కొద్దిరోజులుగా బాలివుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ తో రిలేషన్ లో ఉండి పెళ్లి చేసుకుంటారు అనుకున్న సమయంలో బ్రేకప్ చెప్పుకున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఓ బాస్కెట్ బాల్ ఈవెంట్లో మెరిసిన దిశా పటానీ ఆ ఈవెంట్ కి వచ్చిన సమయంలో వేసుకున్న డ్రెస్ గురించే ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. ఆ బాస్కెట్ బాల్ ఈవెంట్ కి దిశా పటానీ ఓ షార్ట్ డ్రెస్ లో వచ్చింది. ఇక ఆ డ్రెస్సులో రెడ్ హార్ట్ సింబల్స్ డ్రెస్ కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Disha Patani dress cost

దాంతో ఈ డ్రెస్ లో దిశా పటానీ ని చూసిన చాలా మంది యూత్ ఫిదా అయిపోయారు. అయితే ఆ డ్రెస్ కాస్ట్ ఎంత ఉంటుందో అని సోషల్ మీడియాలో ఆరా తీయగా దాని ధర దాదాపు లక్షపైనే ఉన్నట్టు తెలుస్తోంది.ఇక ఆ షార్ట్ డ్రెస్ విలువ అక్షరాల 1,08,994.. ప్రస్తుతం ఆ డ్రెస్ ధర తెలిసి అందరూ కళ్ళు తేలేస్తున్నారు. ఏంటి ఆ చిన్న డ్రెస్ కోసం లక్షకి పైగా ఖర్చు చేసిందా? వింటుంటేనే ఆశ్చర్యంగా ఉంది కదా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం దిశా పఠానీ ఆ డ్రెస్ లో ఉన్న ఫొటోస్ నెట్టింట్లో వైరల్ గా మారాయి.(Disha Patani)

Join WhatsApp