Do you know the cost of Priyanka Chopra's yellow saree?

Priyanka Chopra: సౌత్ సినిమాతో నటనా కెరీర్ ప్రారంభించి.. బాలీవుడ్ లో అగ్ర హీరోయిన్ గా ఎదిగి.. ప్రస్తుతం హాలీవుడ్ లో సత్తా చాటుతున్న ప్రియాంక చోప్రా.. ఇటీవల అయోధ్య నగరంలో సందడి చేసిన సంగతి తెలిసిందే. ముంబైలో జరిగిన ఓ ఈవెంట్ నిమిత్తం మంగళవారం ఫ్యామిలీతో కలిసి ఇండియాకు వచ్చిన ప్రియాంక చోప్రా.. బుధవారం నాడు అయోధ్యకు చేరుకుని శ్రీ రాముడిని దర్శించుకుంది. ఎప్పుడూ మోడరన్ డ్రెస్సులోనే కనిపించే ప్రియాంక.. అయోధ్యలో మాత్రం సాంప్రదాయ చీరలో కనిపించి ఆకట్టుకుంది.

Do you know the cost of Priyanka Chopra’s yellow saree?

అలాగే ప్రియాంకతో పాటు ఆమె భర్త నిక్ జోనస్, కూతురు మాల్టి మరియు మరికొందరు కుటుంబ సభ్యులు కూడా ఆలయానికి వచ్చారు. రామయ్య దర్శనం, పూజలు పూర్తి చేసుకుని.. పూజారుల ఆశీస్సులు తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే ఇప్పుడు అయోధ్యలో ప్రియాంక చోప్రా కట్టుకున్న ఎల్లో శారీ ధర హాట్ టాపిక్ గా మారింది.

భారీ డిజైన్ లేకుండా ప్లెయిన్ ఎల్లో కలర్ చీరలో ప్రియాంక కనిపించింది. అయితే ఆమె కట్టుకున్న చీర సింపుల్ గానే ఉన్నా చాలా కాస్ట్లీ. ఇంతకీ ప్రియాంక పసుపు రంగు చీర ఖరీదు ఎంతో తెలుసా.. అక్షరాల రూ. 63,800. ప్యూర్ ఆర్గానిక్ మెటీరియల్ తో ఆమె చీరను తయారు చేశారు. అందువల్లే ప్రియాంక చీర ఖరీదు అంత ఎక్కువగా ఉందని అంటున్నారు. ఏదేమైనా ఒక సింపుల్ శారీ కోసం ప్రియాంక అంత ఖర్చు పెట్టడం చూసి నెటిజ‌న్లు ఆశ్చర్యపోతున్నారు.(Priyanka Chopra)

Also Read: Deepika Padukone: ఫర్నీచర్ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన దీపికా పదుకొనే.. రేట్లు చూస్తే ఒక్కొక్క‌రికీ దిమ్మ‌తిర‌గాల్సిందే!

కాగా, బాలీవుడ్ లో అన‌తి కాలంలోనే స్టార్ హోదాను అందుకున్న ప్రియాంక చోప్రా.. కెరీర్ ఫుల్ ఫామ్‌లో ఉన్న సమయంలోనే అమెరికన్ సింగర్ నిక్ జోనస్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రియాంక కంటే నిక్ వ‌య‌సులో 10 ఏళ్లు చిన్న‌వాడు. అయితే ప్రేమ ముందు వీరికి వ‌య‌సు అడ్డురాలేదు. ఈ నేప‌థ్యంలోనే 2018లో పెద్దల స‌మ‌క్షంలో ప్రియాంక‌-నిక్ పెళ్లి చేసుకున్నారు. ఆపై లాస్ ఏంజెల్స్ లో సెటిల్ అయ్యారు. వీరికి ఒక పాప కూడా జ‌న్మించింది. ప్ర‌స్తుతం ప్రియాంక హాలీవుడ్ లో యాక్టింగ్ కెరీర్ ను సాగిస్తోంది.

Join WhatsApp