Do you know the favorite movie of Allari Naresh's career

Allari Naresh: కమెడియన్ గా ఇండస్ట్రీకి పరిచయమై అనంతరం హీరోగా అరంగేట్రం చేసిన కమెడియన్స్ లో అల్లరి నరేష్ కూడా ఒకరు. తను కామెడీ పంచులతో హీరో మరియు హీరోయిన్లే కాదు కమెడియన్స్ కి కూడా మంచి పాపులారిటీ ఏర్పడుతుంది అని చాటి చెప్పాడు ఈ హీరో. ప్రస్తుతం తన జోరును తగ్గించి అడపాదడపా సినిమాలను మాత్రమే చేస్తున్నాడు. ఒకప్పుడు ప్రతి సినిమాలోని అల్లరి నరేష్ పేరు వినిపించేది. కానీ ఇప్పుడు ఈయనకి పెద్దగా అవకాశాలు రావడం లేదు.

Do you know the favorite movie of Allari Naresh’s career

మొదట్లో కమెడియన్ గా తన కెరీర్ను స్టార్ట్ చేసి అనంతరం హీరోగా ఎదిగాడు అల్లరి నరేష్. కమెడియన్గా గుర్తింపు సంపాదించుకున్నప్పటికీ హీరోగా మాత్రం పెద్దగా గుర్తింపును పొందలేకపోయాడు. దీంతో నిరాశ చెందకుండా హీరో గానే సినిమాలను చేసుకుంటూ వస్తున్నాడు. ఇక ఒకానొక సమయంలో అల్లరి నరేష్ ఫాలోయింగ్ ముందు స్టార్ హీరోలు కూడా సరిపోరనే చెప్పుకోవచ్చు. కానీ ప్రస్తుత కాలంలో ఈయనకి అవకాశాలు తగ్గడంతో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా తగ్గిపోయింది.

Also Read: Rajamouli: అనిల్ రావిపూడి ని ముసుగేసి కొడితే 10000 ఇస్తా.. బంపర్ ఆఫర్ ఇచ్చిన జక్కన్న..!

ఇక ఇటువంటి తరుణంలోనే మంచి మంచి సినిమాలతో ప్రేక్షకులు ముందుకి వచ్చి మరోసారి ఫామ్ లోకి రావాలని ట్రై చేస్తున్నాడు అల్లరి నరేష్. తాజాగా ఈయన నటించిన మూవీ ఆ ఒక్కటి అడక్కు. ఈ సినిమాలో జాతి రత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించింది. జాతి రత్నాలు సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయిన ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాతో తన రేంజ్ ని మరింత పెంచుకునేందుకు రెడీ అయింది. ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం గట్టిగానే ప్రమోషన్స్ చేపట్టారు మేకర్స్. ఈ ప్రమోషన్స్లో హీరోయిన్ తో పాటు హీరో కూడా హాజరవుతున్నాడు.

Do you know the favorite movie of Allari Naresh's career

ఈ క్రమంలోనే ఓ ప్రమోషన్స్లో.. మీ కెరీర్ లో మీకు ఇష్టమైన సినిమా ఏంటి? అని ఓ జర్నలిస్ట్ అడగగా.. దానికి అల్లరి నరేష్ సమాధానం ఇస్తూ..” నాకు ఫేవరెట్ సినిమా నేను. అది నా పర్సనల్ ఫేవరెట్. అది బాగా ఇష్టపడి మరియు కష్టపడి తీసిన సినిమా. నాకు అందులోని క్యారెక్టర్ గమ్యం మరియు మహర్షి వంటి సినిమాలు రావడానికి కారణం. నేను సినిమా ఆడలేదు కానీ నాకు ఇష్టమైన సినిమా బాగా కష్టపడి చేసిన సినిమా నేను ” అంటూ సమాధానమిచ్చాడు అల్లరి నరేష్. ప్రస్తుతం ఈయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. హిట్ అయిన సినిమాని ఎవ్వడైనా ఇష్టమని చెబుతారు. కానీ ఫ్లాప్ అయిన సినిమాని కూడా ఇష్టమని చెప్పేవాడే అసలైన హీరో.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు ప్రేక్షకులు.(Allari Naresh)

Join WhatsApp