Do You Know the Reason why Allu Arjun's Wife Sneha Reddy Goes to Tirumala

Sneha Reddy: అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి నెలలో కచ్చితంగా రెండు మూడు సార్లు తిరుమలలోనే కనిపిస్తుంది. ఆమె తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్లిన ఫోటోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సంగతి మనకు తెలిసిందే.అయితే రీసెంట్ గానే తన కూతురు అల్లు అర్హతో తిరుమలలో స్నేహ రెడ్డి కనిపించింది.కానీ కూతురితో కలిసి వెళ్ళిన కొద్ది రోజులకే మళ్ళీ స్నేహ రెడ్డి తిరుమల వెళ్ళింది.అయితే ఎవరైనా సరే సంవత్సరానికి ఒకటి రెండు సార్లు వెళుతూ ఉంటారు.

Do You Know the Reason why Allu Arjun’s Wife Sneha Reddy Goes to Tirumala

కానీ అల్లు స్నేహ మాత్రం నెలకు రెండు,మూడు సార్లు తిరుమల తిరుపతి దేవస్థానంలో కనిపిస్తుంది. మరి స్నేహారెడ్డి తిరుమల ఆలయానికి ఎందుకు అన్ని సార్లు వెళుతుంది..ఆమె అలా వెళ్లడానికి కారణం ఏంటి అనే సంగతి ఇప్పుడు తెలుసుకుందాం.. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలోనే ఎక్కువమంది విజిట్ చేసే హిందూ దేవాలయం. ఇక్కడ 365 రోజులు భక్తులు వస్తూనే ఉంటారు. కేవలం ఇండియాలోనే కాకుండా దేశ విదేశాల నుండి కూడా తిరుమల ఆలయానికి భక్తులు వస్తారు.

Also Read: Natural Star Nani: వరుస ఫ్లాప్ లైనా నాని కోసం వెయిటింగ్ లో క్రేజీ డైరెక్టర్స్!!

అయితే అలాంటి ఈ ఆలయానికి సినీ ఇండస్ట్రీ నుండి కూడా చాలామంది సెలబ్రిటీలు వెళ్తూ ఉంటారు. ఇక బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ కూడా తిరుమల కి ప్రతిసారి వస్తూ ఉంటుంది.అలాగే తన తల్లి శ్రీదేవి కూడా వస్తూ ఉండేది. ఇక టాలీవుడ్ లో అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి కూడా తరచూ తిరుమల కి వస్తూ పోతూ ఉంటుంది.

Do you know the reason why Allu Arjun's wife goes to Tirumala

అయితే స్నేహ రెడ్డి అలా తరచుగా తిరుమల తిరుపతి దేవస్థానం సందర్శించడానికి ప్రధాన కారణం ఆమె ఏదైనా పని మొదలు పెట్టేముందు ఆలయాన్ని దర్శించుకుంటుందట. అలాగే తాను మొదలుపెట్టిన పని సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే మళ్లీ ఆలయాన్ని దర్శించుకుంటుందట. అలా ఈ కారణంతోనే స్నేహ రెడ్డి తాను చేయబోయే ఏ పని కోసమైనా సరే ముందుగా ఆ తిరుమల ఆలయాన్ని దర్శించుకుని ఆ తర్వాత పని మొదలుపెడుతుందట. అలా స్నేహారెడ్డికి దైవభక్తి ఎక్కువ అని తెలుస్తుంది. (Sneha Reddy)

Join WhatsApp