Do you know what Keeravani's sons call Rajamouli

Rajamouli: బాహుబలి సినిమాతో ఇండియాలోనే టాప్ డైరెక్టర్లలో ఒకరిగా నిలిచిపోయినా రాజమౌళి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఇక త్రిబుల్ ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమాకు గుర్తింపు తెచ్చి పెట్టాడు జక్కన్న. ఏకంగా ఆస్కార్ అవార్డు సాధించిన సరికొత్త చరిత్ర సృష్టించాడు. రాజమౌళి నెక్స్ట్ మూవీ కోసం ఇప్పుడు ప్రపంచంలోని సినీ ప్రేక్షకులంతా ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

Do you know what Keeravani’s sons call Rajamouli

రాజమౌళి వర్క్ లో ఎంత స్ట్రిక్ట్ గా ఉంటాడో ఫ్యామిలీతో ఉన్నప్పుడు అంతే సరదాగా ఉంటాడు. కీరవాణి చిన్న కొడుకు శ్రీ సింహ ప్రస్తుతం హీరోగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా శ్రీ సింహ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. శ్రీ సింహ మాట్లాడుతూ..” రాజమౌళిని బాబా అని పిలుస్తాము. రాజమౌళి మాకు బాబాయ్ అవుతాడు. దాంట్లో షార్ట్ కట్ గా బాబా. అలా పిలిస్తే ఆయనకు కూడా ఇష్టం.

Also Read: Legs: పాదాల పగుళ్లతో చింతిస్తున్నారా?.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

బాబా అని పిలవమని ఆయనే మాకు చెప్పారు. మేమంతా ఆయన్ని బాబా అనే పిలుస్తూ ఉంటాము ” అంటూ చెప్పుకొచ్చాడు శ్రీ సింహ. ప్రస్తుతం ఈయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో… క్యూట్ నేమ్.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు ప్రేక్షకులు. ఇక ప్రస్తుతం రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని ఇప్పటికే అఫీషియల్ గా ప్రకటించారు. ఇటీవల గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన మహేష్ పెద్దగా సక్సెస్ ని అందుకోలేకపోయాడు.

Do you know what Keeravani's sons call Rajamouli

దీంతో నెక్స్ట్ రాజమౌళి సినిమాపై ఫుల్ హైప్స్ పెట్టుకున్నారు ఫ్యాన్స్. ఈ తరుణంలోనే ఈ సినిమాని త్రిబుల్ ఆర్ కి మించి రూపొందిద్దామని ఫిక్స్ అయ్యాడు జక్కన్న. నిజానికి ఒక డైరెక్టర్ కెరీర్ లో ఫ్లాప్స్ అనేవి సహజం. కానీ తన కెరీర్లో ఒక్క ఫ్లాప్ అని సినిమాని కూడా వేసుకోకుండా సినీ ఇండస్ట్రీలో రాణిస్తున్న ఏకైక డైరెక్టర్ రాజమౌళి అనే చెప్పుకోవచ్చు. ఎంతటి డైరెక్టర్ కి అయిన విజయం మరియు అపజయాలు కామన్ గా ఉంటాయి. కానీ రాజమౌళికి మాత్రం విజయాలు కానీ అపజయాలు మాత్రం లేవు.(Rajamouli)

Join WhatsApp