Do you remember Mahesh's sister in Okkadu movie

Okkadu movie: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన సినిమాలు అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించాయిని చెప్పుకోవచ్చు. అటువంటి సినిమాలలో ఒక్కడు మూవీ కూడా ఒకటి. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ సంచలన విజయంగా నిలిచింది. మహేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా కూడా పేరు సంపాదించుకుంది.

Do you remember Mahesh’s sister in Okkadu movie

ఇక ఒక్కడు మూవీ అనంతరం మహేష్ బాబు రేంజ్ మరియు క్రేజ్ మొత్తం మారిపోయిందని చెప్పుకోవచ్చు. అప్పటివరకు మహేష్ బాబును కేవలం ఒక హీరో లాగానే చూసేవారు కానీ ఈ మూవీ అనంతరం సూపర్ స్టార్ అనే బిరుదును సైతం మహేష్ కి ఇచ్చారు. ఒకప్పుడు సినిమా పలు భాషల్లో రీమేక్ అయి అన్ని చోట్లా సూపర్ హిట్ గా నిలిచేది. ఇక ఒక్కడు సినిమాలో మహేష్ బాబు భూమిక నటన మరియు పాటలు, స్క్రీన్ ప్లే అద్భుతం అని చెప్పుకోవచ్చు.

Also Read: Chiranjeevi: చిరు – బన్నీ మధ్య తలెత్తిన గొడవలు.. కారణం ఇదే..!

అదేవిధంగా విలన్ గా ప్రకాష్ రాజ్ నటన కూడా వేరే లెవెల్. ఇక ఇదిలా ఉంటే ఈ మూవీలో మహేష్ బాబు చెల్లెలిగా నటించిన అమ్మాయి గుర్తుందా? ఒకప్పుడు సినిమాలలో మహేష్ బాబును ఇరిటేట్ చేసే అల్లరి చెల్లి పాత్రలో నటించిన ఆ ముద్దుగుమ్మ పేరు నిహారిక. ఇక నిహారిక ఒక్కడు మూవీ లోనే కాకుండా అనేక సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. వెంకటేష్ ప్రేమించుకుందాం రా.. మోహన్ బాబు యమజాతకుడు.. వంటి సినిమాల్లో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ లుక్ లోకి మారిపోయింది.

Do you remember Mahesh's sister in Okkadu movie

అప్పుడు ఎంతో క్యూట్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం స్టార్ హీరోయిన్లని తలదన్నే అందంతో నిండి ఉంది. ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సినిమాల్లో నటించడం లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించిన నిహారిక అనంతరం తన ఫోకస్ చదువులపై పెట్టింది. ఇక ఆ తరువాత పెళ్లి చేసుకుని సినిమాలకు పూర్తిగా దూరమైంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో తన ఫోటోలను అప్లోడ్ చేస్తూ తన ఫ్యాన్స్ కి ట్రీట్ ఇస్తుంది. ప్రస్తుతం ఈమెకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(Okkadu movie)

Join WhatsApp