Double Ismart Movie Climax Budget Details Here

Double Ismart: టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్ర‌స్తుతం త‌నకు మాస్ ఇమేజ్ అందించిన డైన‌మిక్ డైరెక్ట‌ర్ జ‌గ‌న్నాథ్ తో వ‌ర్క్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. వీరి కాంబోలో తెర‌కెక్కుతున్న చిత్రం డ‌బుల్ ఇస్మార్ట్‌. బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ఇస్మార్ట్ శంక‌ర్ కు సీక్వెల్ గా ఈ మూవీని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో కావ్య థాపర్ హీరోయిన్ యాక్ట్ చేస్తుంటే.. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ప్ర‌తినాయకుడు పాత్ర‌ను పోషిస్తున్నారు. పూరీ క‌నెక్ట్స్ బ్యాన‌ర్ పై ఛార్మీ కౌర్ తో క‌లిసి పూరీ జ‌గ‌న్నాథ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Double Ismart Movie Climax Budget Details Here

మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తున్నారు. లైగ‌ర్ డిజాస్ట‌ర్ తో భారీగా న‌ష్ట‌పోయిన పూరీ జ‌గ‌న్నాథ్‌, ఛార్మీ.. డ‌బుల్ ఇస్మార్ట్ తో ఆ న‌ష్టాల‌ను భ‌ర్తీ చేయాల‌ని క‌సితో వ‌ర్క్ చేస్తున్నారు. మ‌రోవైపు బోయ‌పాటి శ్రీ‌నుతో చేసిన స్కంద ఫ్లాప్ అవ్వ‌డంతో రామ్ కూడా ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాల‌ని ఆశ‌ప‌డుతున్నాడు. స్కంద విడుద‌ల‌కు ముందే డ‌బుల్ ఇస్మార్ట్ షూటింగ్ ప్రారంభ‌మైంది.

70 శాతానికి పైగా షూటింగ్ కంప్లీట్ అయింది. తాజాగా క్లైమాక్స్ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించారు. ముంబైలో వేసిన ఓ భారీ సెట్లో క్లైమ్యాక్స్ జ‌రిగింది. అయితే డ‌బుల్ ఇస్మార్ట్ క్లైమాక్స్ బ‌డ్జెట్ ఇప్పుడు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. క్లైమాక్స్ కోస‌మే పూరీ జ‌గ‌న్నాథ్ ఎన్ని కోట్లు ఖ‌ర్చు పెట్టాడో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు. ఎందుకంటే, రూ. 7.5 కోట్లు ఖ‌ర్చు పెట్టి క్లైమాక్స్ స‌న్నివేశాల‌ను షూట్ చేశారట‌. దాదాపు రెండు వారాల పాటు వందల మంది ఫైటర్లతో డ‌బుల్ ఇస్మార్ట్‌ క్లైమ్యాక్స్ ను పూర్తి చేశారు.(Double Ismart)

Also Read: Samantha: రూ. 12 కోట్లు న‌ష్ట‌పోయిన స‌మంత‌.. ఫుల్ ఖుషీలో ఆ స్టార్ హీరోయిన్‌?!

రామ్‌, సంజ‌య్ ద‌త్ తో స‌హా ప‌లువురు కీల‌క పాత్ర‌దారులు ఈ షెడ్యూల్ లో పాల్గొన్నార‌ని తెలుస్తోంది. కాగా, శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న డ‌బుల్ ఇస్మార్ట్ ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో మ‌హాశివ‌రాత్రి కానుక‌గా మార్చి 8న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇప్ప‌టికే రిలీజ్ డేట్ ను మేక‌ర్స్ అఫీషియ‌ల్ గా అనౌన్స్ చేశారు. మ‌రి మాస్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ రామ్ మ‌రియు పూరీ జ‌గ‌న్నాథ్‌కు ఎలాంటి విజ‌యాన్ని అందిస్తుందో చూడాలి.

Join WhatsApp