favorite heroine of our Ravi Teja

Ravi Teja: టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ మహారాజ్ గా పేరు సంపాదించుకున్న రవితేజ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్న రవితేజ ఇటీవలే ఈగల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ విజయం అందుకున్నాడు.

favorite heroine of our Ravi Teja

ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి తనదైన ముద్ర వేసుకున్న రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. అంతేకాకుండా నూతన దర్శకులకు అవకాశం ఇస్తూ తన గొప్ప మనస్తత్వాన్ని చాటుకుంటున్నాడు. ఇటీవల రిలీజ్ అయిన ఈగల్ మరియు టైగర్ నాగేశ్వరరావు సినిమా డైరెక్టర్స్ కూడా నూతన దర్శకులే.

Also Read: Water: ఈ పనులు చేయబోతున్నారా.. అయితే తప్పనిసరిగా వాటర్ తాగాల్సిందే..?

ప్రస్తుతం వారి కి భారీ పాపులారిటీ దక్కిందని చెప్పుకోవచ్చు. అలా తన వంతు సాయం చేస్తూ ముందుకు సాగుతున్నాడు రవితేజ. ఇక మన టాలీవుడ్ హీరోలు ఎంత ఎత్తుకు ఎదిగిన వారికి ఓ హీరోయిన్ అంటే ఇష్టం అనేది ఉంటుంది. అలానే రవితేజ కి కూడా ఓ హీరోయిన్ అంటే ఇష్టం. ఈ విషయాన్ని స్వయంగా రవితేజ నే ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు.

favorite heroine of our Ravi Teja

మీకు బాగా ఇష్టమైన హీరోయిన్.. అనుష్క, ఇలియానా, త్రిష, శ్రేయ నా అని.. ప్రశ్నించగా..” నాకు ఇష్టమైన హీరోయిన్ అనుష్క. ఆమె యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం ” అంటూ తనకి అనుష్క పై ఉన్న ఇష్టాన్ని బయట పెట్టాడు రవితేజ. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.(Ravi Teja)

Join WhatsApp