Finally Kumari Aunty opened her mouth about Pari Doshakam

Kumari Aunty: ఎటువంటి బ్యాగ్రౌండ్ మరియు సినిమాలపై అవగాహన లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వారు ఎవరైనా ఉన్నారు అంటే మనందరికీ ముందుగా గుర్తుకొచ్చేది కుమారి ఆంటీ. ఎక్కడో చిన్న ఫుడ్ షాప్ నుంచి ఈమె కెరీర్ మొదలై ప్రస్తుతం సినిమాలలో మరియు సీరియల్స్ లో నటించే వరకు వెళ్లిపోయింది. ఎటువంటి అవగాహన లేకుండా ఈమెని ఫేమస్ చేయడంతో ఈమె సైతం డబ్బు కోసం సీరియల్స్ లో నటించేందుకు ఒప్పుకుంది.

Finally Kumari Aunty opened her mouth about Pari Doshakam

ఇటీవల అనేక సీరియల్స్ లో నటించి మెప్పించింది కూడా. పలు కార్యక్రమాలకి హాజరవుతూ సందడి చేస్తుంది. రెండు లివర్లు ఎగస్ట్రా మీది మొత్తం 1000 అయింది అంటూ ఓ రేంజ్ లో ఫేమస్ అయిపోయింది కుమారి ఆంటీ. ఆమె పాటికి ఆమె ఏదో చిన్న ఫుడ్ షాప్ నడుపుకుంటూ ఉంటుంటే మీడియా ఛానల్స్ మరియు సోషల్ మీడియా ఇన్ఫ్లెన్సర్స్ అందరూ కలిపి ఆమెని ఫుల్ గా ఫేమస్ చేశారు.

Also Read: Health: కిడ్నీ రాళ్ల సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.. డాక్టర్ పని లేకుండా ఈ సింపుల్ టిప్స్ తో విముక్తి పొందండి..!

దీంతో ఆమెకి కూడా బానే కలిసి వచ్చింది అనుకుందో ఏమో తెలియదు కానీ సీరియల్స్ లో నటించేందుకు ఒప్పుకుంటూ భారీ రెమ్యూనరేషన్ పుచ్చుకుంటుంది. సహజంగా ప్రస్తుతం కుమారి ఆంటీ ఎంత రెమ్యూనరేషన్ పుచ్చుకుంటుంది అనే సందేహం అందరిలోనూ ఉంటుంది. ఇక తాజాగా తన రెమ్యూనరేషన్ గురించి బయట పెట్టింది కుమారి ఆంటీ. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె..” సీరియల్స్ లో షూటింగ్ 3 ,4 డేస్ ఉంటుందని చెప్పారు. ఏదో ఒకటి రెండు రోజులు అయితే ఓకే కానీ.. నాకు ఫుడ్ షాప్ తో కుదరదు. పొద్దున్నే ఐదింటికి మొదలుపెడితే వంటలు అయ్యేటప్పటికి 11 మరియు 11:30 అవుతుంది. మళ్లీ అక్కడికి వెళ్లి వాటిని అమ్ముకుని మళ్ళీ ఇంటికి వచ్చి వండుకోవాలి.

Finally Kumari Aunty opened her mouth about Pari Doshakam

అందుకు నేను ఎవరొచ్చినా ఒకటే చెప్తా మూడు దాటిన తరువాత నేను ఖాళీగా ఉంటాను. మూడు దాటిన తరువాతే మీ సీరియల్స్ లో కి వస్తాను అని చెప్పాను. అలా వారు కూడా ఇష్టపడి పిలిచారు. నిజానికి యాక్టింగ్ కంటే వంటే 1000రెట్లు బెటర్. రెమ్యూనరేషన్ విషయానికి వస్తే.. రోజుకు కనీసం ఒక 5000 వరకు ఇచ్చేవారు ” అంటూ చెప్పుకొచ్చిది కుమారి ఆంటీ. ప్రస్తుతం ఈమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారగా.. కష్టపడి సీరియల్స్ లో కి వెళ్లేవారు కొందరైతే ఇలా సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయి వెళ్లేవారు మరికొందరు. ఏదేమైనా లక్ ఉండాలిలే.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.(Kumari Aunty)

Join WhatsApp