Fix second heroine in Nitin Tammudu movie

Tammudu: ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి ఫ్లాప్టాప్ దక్కించుకున్న నితిన్ ప్రస్తుతం తమ్ముడు ప్రాజెక్ట్ పై దృష్టి పెట్టాడు. భీమ్లా నాయక్ సినిమాతో పేరు తెచ్చుకున్న వేణు శ్రీరామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇక ఈ మూవీలో కాంతార ఫేమ్ సప్తమి గౌడ హీరోయిన్గా సెలెక్ట్ అయ్యింది. ఇక తాజాగా ఈ ప్రాజెక్టుకి సంబంధించిన మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Fix second heroine in Nitin Tammudu movie

ఇటీవల ఊరి పేరు భైరవకోన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ విజయం అందుకున్న వర్షా బొల్లమ్మ ఈ చిత్రంలో మరో హీరోయిన్ గా నటించబోతున్నట్లు తెలుస్తుంది. అయితే ఇది సినిమాలో పూర్తిస్థాయిలో ఉండే క్యారెక్టర్ కాకపోయినప్పటికీ కీలక పాత్ర గా ఉండనున్నట్లు తెలుస్తుంది. ఇక దీనిపై త్వరలోనే అఫీషియల్ క్లారిటీ కూడా రానుంది.

Also Read: Tollywood: పైన ఫోటోలో కనిపిస్తున్న చిన్నారిని గుర్తుపట్టారా? .. ఇప్పుడు ఈమె స్టార్ హీరో భార్యండోయ్..!

ఇక ఈ చిత్రంలో నితిన్ సోదరీగా లయ యాక్ట్ చేస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. రూ. 8 కోట్లతో ఓ హై ఆక్టేన్ హిట్ సక్సెస్ను ఈ షెడ్యూల్లో చిత్రీకరించనున్నారు. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇటీవల విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఫ్యామిలీ స్టార్ మూవీ తో ప్రేక్షకుల ముందుకి వచ్చిన దిల్ రాజు ఘోరంగా అప్పులు పాలు అయ్యాడు.

Fix second heroine in Nitin Tammudu movie

సినిమా కి పెట్టిన బడ్జెట్ కూడా తిరిగి రాకపోవడంతో నష్టాల్లో కూరుకు పోయాడు దిల్ రాజు. ఇక ఆ నష్టాల నుంచి కోలుకోవడానికి మంచి సినిమా కాన్సెప్ట్లను ఎంచుకుంటూ ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడు దిల్ రాజు. మరి నితిన్ సినిమాలో వర్ష క్యారెక్టర్ ఎలా ఉంటుందో త్వరలోనే అఫీషియల్ క్లారిటీ కూడా రానుంది. ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో ఫుల్ వారీలు అవుతుంది.(Tammudu)

Join WhatsApp