Game Changer Movie OTT Deal Closed By Record Price

Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ సినిమానే గేమ్ ఛేంజర్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎస్.జే సూర్య, సునీల్, నవీన్ చంద్ర, జయరామ్, శ్రీ‌కాంత్‌, నాజర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు.

Game Changer Movie OTT Deal Closed By Record Price

రెండేళ్ల క్రితమే ప్రారంభమైన గేమ్ చేంజర షూటింగ్ ఎట్టకేలకు తుది దశకు చేరుకుంది. ఇటీవల విశాఖపట్నంలో ఓ మేజర్ షెడ్యూల్ ను పూర్తి చేశారు. తదుపరి షెడ్యూల్ హైదరాబాద్లో జరగబోతోంది. ఇదిలా ఉంటే.. గేమ్ ఛేంజ‌ర్ మూవీకి సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ తెరపైకి వచ్చింది. తాజాగా మేకర్స్ ఈ సినిమా ఓటీటీ డీల్ ను క్లోజ్ చేశారు. ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో గేమ్ ఛేంజ‌ర్ డిజిటల్ హ‌క్కుల‌ను సొంతం చేసుకుంది.

ఈ విషయాన్ని తాజాగా అమెజాన్ ప్రైమ్‌ ధ్రువీకరించింది. గేమ్ ఛేంజ‌ర్ డిజిటల్ రైట్స్ కళ్ళు చెదిరే ధరకు అమ్ముడుపోయాయని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. రాజమౌళి తెర‌కెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ తో రామ్ చరణ్ ఇంటర్నేషనల్ వైడ్ గా క్రేజ్ సంపాదించుకున్నాడు. గ్లోబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు. ఆర్ఆర్ఆర్ దెబ్బ‌కు ఆయ‌న ఇమేజ్ తో పాటు మార్కెట్ కూడా భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్ తదుపరి చిత్రమైన గేమ్ ఛేంజ‌ర్‌ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.(Game Changer)

Also Read: Rajinikanth: సూపర్ స్టార్ ర‌జ‌నీకాంత్ త‌న కెరీర్ లో పైసా తీసుకోకుండా యాక్ట్ చేసిన ఏకైక సినిమా ఏదో తెలుసా?

దీంతో ఈ సినిమా ఓటీటీ హ‌క్కుల‌ను దక్కించుకునేందుకు ప్రముఖ సంస్థలు పోటీ పడగా.. చివరకు అమెజాన్ ప్రైమ్ వీడియో రికార్డ్ ధరకు రామ్ చరణ్ సినిమా డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకుంది. ఏకంగా రూ. 105 కోట్లకు ఈ డీల్ క్లోజ్ అయిందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయం తెలిసి సినీ ప్రియులు షాక్‌ అయిపోతున్నారు. మ‌రోవైపు రామ్ చరణ్ క్రేజ్ కు ఇది ఒక నిదర్శనమని అభిమానులు ఆనందంగా ఫీల్ అవుతున్నారు.

Join WhatsApp