Geethanjali Malli Vachindhi movie teaser released

Geethanjali Malli Vachindhi: తెలుగు నటి అంజలి ప్రధాన పాత్ర లో నటించిన సూపర్ హిట్ సినిమా గీతాంజలి ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. 2014లో విడుదలైన ఈ చిత్రానికి దర్శకుడు రాజ్ కిరణ్. ఈ సినిమా లో శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్, రావు రమేష్, బ్రహ్మానందం తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఈ సినిమా కలెక్షన్లు కూడా బాగానే ఉన్నాయి. అయితే దాదాపు 10 ఏళ్ల తర్వాత గీతాంజలికి సీక్వెల్‌గా వస్తోంది. ఈ చిత్రానికి శివ తుర్లపాటి దర్శకత్వం వహించగా, ప్రముఖ రచయిత కోన వెంకట్ కథ అందించారు.

Geethanjali Malli Vachindhi movie teaser released

నిర్మాతలు తమ రాబోయే చిత్రాలను వినూత్న రీతిలో ప్రమోట్ చేస్తున్నారు. దీని కోసం సినీ చరిత్రలో ఎవరు చేయనట్లు శ్మశానవాటిక లో టీజర్ ను ఆవిష్కరించారు. హారర్ నేపథ్యంలో సాగే ఈ సినిమా టీజర్ ను బేగంపేట్ లోని స్మశాన వాటికలో విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఫిబ్రవరి 24న సాయంత్రం 7 గంటలకు హైదరాబాద్‌లోని పంజాగుట్ట శ్మశానవాటికలో గీతాంజలి ట్రైలర్‌ను విడుదల చేయనున్నాం. అని ఒక ప్రకటన చేశారు.

దీనికి పలువురు దగ్గరినుంచి మిశ్రమ స్పందన అందుకుంటుంది. ప్రేక్షకులు స్మశానవాటికలో ట్రైలర్‌ లాంచ్ ఏంటి అని కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది సినిమా బజ్ కోసం ఇది చేస్తున్నారని చెప్తుంటే, మరికొందరు ఐడెమ్ ప్రమోషన్స్ అని విమర్శిస్తున్నారు. ఇంకొందరు చచ్చిన వారిని కూడా వదలరా అని కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ వినూత్న నిర్ణయంతో గీతాంజలి ఈజ్ బ్యాక్ అంటూ సోషల్ మీడియాలో ఈ సినిమా ట్రెండ్ అవుతోంది. మరి ఈ సినిమా ఈమేరకు ఆకట్టుకుంటుందో చూద్దాం.

Join WhatsApp