Getup Srinu From Comedian to Rising Actor

Getup Srinu: తెలుగు సినీ ఇండస్ట్రీలో మొదట జబర్దస్త్ కమెడియన్ గా మంచి పాపులారిటీ సంపాదించారు నటుడు గెటప్ శ్రీను.. ఆ తర్వాత తన కామెడీ టైమింగ్ తో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించడంతో పలు సినిమాలలో చిన్న చిన్న క్యారెక్టర్లలో నటించారు. గెటప్ శ్రీను ఈ మధ్యకాలంలో నటించిన ఎన్నో చిత్రాలు మంచి పాపులారిటీ అందుకుంటున్నాయి. ముఖ్యంగా మా ఊరి పొలిమేర, ధమాకా, పొలిమేర-2, హనుమాన్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నాయి.. పాత్ర ఏదైనా సరే తన నటనతో అందరిని ఆకట్టుకుంటూ ఉంటారు.

Getup Srinu From Comedian to Rising Actor

తెలుగు సినీ ఇండస్ట్రీకి గెటప్ శ్రీను రూపంలో మరో గొప్ప నటుడు దొరికారని చెప్పవచ్చు.. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ నటుడిని ఉపయోగిస్తే.. సునీల్ బ్రహ్మానందం తదితర నటీనటులలో ఒకరిగా అవుతారని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఎలాంటి పాత్రలోనైనా సరే ఎమోషనల్ సన్నివేశాలలోనైనా సరే గెటప్ శ్రీను తన పాత్రలకు సంబంధించి పూర్తిగా న్యాయం చేస్తారని దర్శక నిర్మాతలు చెప్పిన పాత్రలకు పూర్తి న్యాయం చేస్తున్నారని చెప్పవచ్చు.

Also Read: YCP MLA Varaprasad: వైసీపీ నుంచి రోజురోజుకు పెరుగుతున్న వ‌ల‌స‌లు.. మ‌రో సిట్టింగ్ ఎమ్మెల్యే ఔట్‌!?

గెటప్ శ్రీను రెమ్యూనరేషన్ విషయంలో ఆలోచించకుండా మంచి పాత్రలు చేస్తే కెరియర్ బాగుంటుందని ఆయన అభిమానులు తెలుపుతున్నారు. ఒకవైపు జబర్దస్త్ షోలో చేస్తూనే తన కెరీర్ని సినిమాల వైపు కూడా కొనసాగిస్తూ బాగానే సంపాదిస్తున్నారు.. గెటప్ శ్రీను ఈ స్థాయికి చేరుకోవడం వెనుక చాలానే కష్టం ఉందని కూడా చెప్పవచ్చు.. శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన గెటప్ శ్రీను అంచలంచెలుగా ఎదుగుతూ తన సత్తా చాటుతూనే ఉన్నారు.

Getup Srinu From Comedian to Rising Actor

చాలామంది హీరోలు వాయిస్ తో భారీ క్రేజ్ అందుకున్న గెటప్ శ్రీను ఎంతోమంది హీరోలతో అభినందించేలా చేసుకుంటున్నారు. మెగా కుటుంబ హీరోల సినిమాలలో తరచూ ఎక్కువగా పలు సినిమాలలో కనిపిస్తూ ఉండడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇప్పటివరకు గెటప్ శ్రీను దాదాపుగా 70 పైగా సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించినట్లు తెలుస్తోంది. గెటప్ శ్రీను ఎక్కువగా పాన్ ఇండియా సినిమాలలో కూడా నటించడానికి మక్కువ చూపుతున్నట్లు సమాచారం. మరి రాబోయే రోజుల్లో ప్రతి సినిమాలో కూడా తన పాత్ర ఉండేలా గెటప్ శ్రీను ప్లాన్ చేసుకుంటారేమో చూడాలి. (Getup Srinu)

Join WhatsApp