Good news for Keerthy Suresh fans

Keerthy Suresh: మహానటి కీర్తి సురేష్ పెళ్లి వార్తలు ఈ మధ్యకాలంలో ఎన్ని సార్లు క్లారిటీ ఇచ్చిన కూడా ఎప్పటికప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారుతూనే ఉన్నాయి. ఈమె పెళ్లి వార్తలపై ఇప్పటికే తండ్రి,తల్లి ఇద్దరు క్లారిటీ ఇచ్చినా కూడా అస్సలు ఆగడం లేదు..అయితే తాజాగా కీర్తి సురేష్ మీద మరొక పెళ్లి రూమర్ చక్కెర్లు కొడుతుంది.అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Good news for Keerthy Suresh fans

నేను శైలజ, నేను లోకల్,రెమో, దసరా, రైల్, సర్కార్ వారి పాట, మహానటి, రంగ్ దే,భోళా శంకర్ వంటి ఎన్నో తెలుగు సినిమాల్లో నటించింది కీర్తి సురేష్. ఇవే కాకుండా కొన్ని తమిళ సినిమాలు అలాగే ఈ మధ్యకాలంలో హిందీ సినిమాల్లో కూడా నటిస్తుంది. అయితే అలాంటి కీర్తి సురేష్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందట.అయితే ఇప్పటికే చాలాసార్లు కీర్తి సురేష్ పెళ్ళంటూ వార్తలు చక్కర్లు కొట్టినప్పటికీ అందులో ఏ ఒక్కటి నిజం కావడం లేదు. (Keerthy Suresh)

Also Read: Pooja Hegde: పెళ్లికి రెడీ అయిన పూజ హెగ్డే.. ఫోటోతో క్లారిటీ..!

కానీ తాజాగా మరో పెళ్లి వార్త కీర్తి సురేష్ పై వినిపిస్తోంది. అదేంటంటే కీర్తి సురేష్ తన చిన్ననాటి స్నేహితుడితో దాదాపు 13 సంవత్సరాలుగా రిలేషన్ లో ఉందట. ఇక ఆ వ్యక్తినే తొందరలో కీర్తి సురేష్ వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త జోరుగా చక్కర్లు కొట్టడంతో మరోసారి కీర్తి సురేష్ పెళ్లి వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఎన్నిసార్లు తనపై పెళ్లి వార్తలు వినిపించినా కూడా కీర్తి సురేష్ స్పందించకపోవడంతో ఆమె అభిమానులు కాస్త నిరాశలో ఉన్నారు.

Good news for Keerthy Suresh fans

ఈ విషయంలో ఏదో ఒకటి క్లారిటీ ఇవ్వాలి అని భావిస్తున్నారు. కానీ కీర్తి సురేష్ మాత్రం ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునేలా కనిపించడం లేదు. ఎందుకంటే ఈ మధ్యనే బాలీవుడ్ కి వెళ్ళింది. బాలీవుడ్ లో కూడా రెండు మూడు సినిమాలకు ఒప్పుకుంది. ఒకవేళ ఆమె ప్రేమలో ఉన్నది నిజమయితే కావచ్చు కానీ పెళ్లి మాత్రం ఇప్పుడు చేసుకునేలా లేదు.(Keerthy Suresh)

Join WhatsApp