Hanuman Producer Gifts A Luxury Car To Director Prasanth Varma

Prasanth Varma: సంక్రాంతి కానుక‌గా పాన్ ఇండియా స్థాయిలో విడుద‌లైన హ‌నుమాన్ మూవీ భారీ విజ‌యాన్ని సాధించిన సంగ‌తి తెలిసిందే. తేజ స‌జ్జ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ ప్ర‌శాంత్ వ‌ర్మ తెర‌కెక్కించిన ఈ చిత్రం పెద్ద పెద్ద హీరోల సినిమాల‌తో పోటీ ప‌డుతూ బాక్సాఫీస్ బ‌రిలోకి దిగింది. ప్రీమియ‌ర్ షోల ద్వారా హిట్ టాక్ సొంతం చేసుకుంది. టాక్ అనుకూలంగా ఉండ‌టం, పండ‌గ అడ్వాంటేజ్ క‌లిసి రావ‌డంతో హ‌నుమాన్ చెల‌రేగిపోయింది. సౌత్‌, నార్త్‌, ఓవ‌ర్సీస్ అనే తేడా లేకుండా క‌లెక్ష‌న్ల ప‌రంగా దుమ్ము దులిపేస్తోంది.

Hanuman Producer Gifts A Luxury Car To Director Prasanth Varma

ఇప్ప‌టికే వ‌ర‌ల్డ్ వైడ్‌గా హనుమాన్ చిత్రం వసూళ్లు రూ. 250 కోట్ల మార్క్ దాటేశాయి. రూ. 300 కోట్ల మార్క్ ను కూడా టచ్ చేయడం ఖాయంగా క‌నిపిస్తోంది. హ‌నుమాన్ మూవీ దాదాపు మూడు రెట్లు అధికంగా లాభాలు తెచ్చిపెట్టింది. హ‌నుమాన్ గ్రాండ్ స‌క్సెస్ తో నిర్మాత కె.నిరంజన్‌ రెడ్డి ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఈ నేప‌థ్యంలోనే డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ‌కు ఖ‌రీదైన గిఫ్ట్ ఇచ్చేందుకు ఆయ‌న రెడీ అవుతున్నారు.

హ‌నుమాన్ స‌క్సెస్ లో ప్ర‌ధాన పాత్ర పోషించింది ప్ర‌శాంత్ వ‌ర్మ‌నే అన‌డంలో ఏ మాత్రం సందేహం లేదు. ఆక‌ట్టుకునే స్క్రీన్ ప్లే, క్వాలిటీ విజువల్స్ తో సినిమాను ప్రశాంత్ వర్మ ఎంతో అద్భుతంగా ప్ర‌జెంట్ చేశాడు. అందుకే ప్ర‌శాంత్ వ‌ర్మ‌కు ఓ ల‌గ్జ‌రీ కారును గిఫ్ట్ గా ఇచ్చేందుకు కె.నిరంజ‌న్ రెడ్డి నిర్ణయించుకున్నారు. దాదాపు రూ. 6 కోట్లు విలువ చేసే న్యూ రేంజ్‌ రోవర్‌ కారును ప్ర‌శాంత్ వ‌ర్మ కోసం బుక్ చేయించార‌ట‌.(Prasanth Varma)

Also Read: Nikhil Siddhartha: ఘ‌నంగా నిఖిల్ స‌తీమ‌ణి సీమంతం వేడుక‌.. యంగ్ హీరో ఎమోష‌న‌ల్ పోస్ట్ వైర‌ల్‌!

త్వ‌ర‌లోనే ఆ కారు డెలివ‌రీ కానుంద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. కాగా, హ‌నుమాన్ చివ‌ర్లో ప్ర‌శాంత్ వ‌ర్మ సీక్వెల్ కు లీడ్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. రాముడికి హనుమంతుడు ఇచ్చిన మాట ఏమిటి? అన్న స్టోరీతో సీక్వెల్ రాబోతోంది. జై హనుమాన్ అనే టైటిల్ ను క‌న్ఫార్మ్ చేశారు. అలాగే స్క్రిప్ట్ వ‌ర్క్ కూడా కంప్లీట్ అయింద‌ని ప్ర‌శాంత్ వ‌ర్మ వెల్ల‌డించాడు. దీంతో మూవీ ల‌వ‌ర్స్ జై హనుమాన్ కోసం ఎంతో క్యూరియాసిటీతో ఉన్నారు. 2025లో ఈ చిత్రం విడుద‌ల అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి.

Join WhatsApp