Harish Shankar's Mega Chance Back to Back Movie Release

Harish Shankar: గద్దలకొండ గణేష్ సినిమా తర్వాత దర్శకుడు హరీష్ శంకర్ మళ్లీ ఉస్తాద్ భగత్ సింగ్‌ సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా చాలా రోజులు వెయిట్ చేశాక ఈ సినిమా ట్రాక్‌లోకి రాగా మళ్ళీ ఏపీ ఎన్నికల కారణంగా పవన్ కళ్యాణ్ ఈ సినిమా ను హోల్డ్ లో పెట్టారు. అయితే వెంటనే రవితేజతో కలిసి “మిస్టర్ బచ్చన్” సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.

Harish Shankar’s Mega Chance Back to Back Movie Release

ఇది బాలీవుడ్ హిట్ చిత్రం “ది రైడ్”కి రీమేక్ కాగా ఈ వేసవిలో థియేటర్లలోకి రానుంది. అయితే ఈ సినిమా ఇంకా కంప్లీట్ కాకముందే హరీష్ శంకర్ మరో భారీ అవకాశాన్ని అందుకున్నది ఇండస్ట్రీ టాక్ నడుస్తుంది. చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న సినిమా కోసం హరీష్ శంకర్ ని డైరెక్టర్ గా ఎంచుకున్నారని తెలుస్తుంది. వాస్తవానికి ఈ సినిమా ను ఎప్పుడో చేయాల్సి ఉండగా ఎందుకు ఇది మొదలవడం చాలా ఆలస్యం అయ్యింది.

Also Read: Prasanth Varma: హ‌నుమాన్ గ్రాండ్ స‌క్సెస్‌.. డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ‌కు నిర్మాత ఖ‌రీదైన‌ గిఫ్ట్‌!?

అయితే ఈ సినిమా కు హరీష్ శంకర్ ను ఎంపిక చేయడం పట్ల ఓ కథ ఉంది. భోళా శంకర్ సినిమా తర్వాత ఈ సినిమా ను దర్శకుడు కళ్యాణ్ కృష్ణతో చేయడానికి చిరంజీవి అంగీకరించారు. స్క్రీన్ రైటర్ బెజవాడ ప్రసన్నకుమార్‌తో కలిసి స్క్రిప్ట్ రాశారు. అయితే ఆ తర్వాత మనసు మార్చుకుని దాన్ని పక్కనపెట్టారు. బడ్జెట్ తక్కువ కాబట్టి.. ముందుగా సింగిల్ ప్రొడ్యూసర్ కార్డుపై ‘సుస్మిత’ నిర్మాణం చేయాలనేది ప్లాన్. అయితే హరీష్ శంకర్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో జాయింట్ పార్టనర్‌గా చేరిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి.

Harish Shankar's Mega Chance Back to Back Movie Release

వాళ్ళే మిస్టర్ బచ్చన్ నిర్మాతలు కావడంతో ఈ కాంబినేషన్ సెట్ అయింది. దీనిపై ఇంకా అధికారిక సమాచారం అయితే లేదు కాబట్టి త్వరలో వస్తుందేమో చూడాలి. చిరంజీవి కూతురుగా సుష్మిత పలు చిరు సినిమాలకు పనిచేసింది. ఆమె నిర్మాణంలో వచ్చిన శ్రీదేవి శోభన్ బాబు సినిమా గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రాగా ఆ సినిమా డిజాస్టర్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. దాంతో ఆమె వాళ్ళ నాన్నతో చేస్తే, మార్కెట్ మరియు బ్రాండ్ ఒకే సమయంలో పెరుగుతాయి, కాబట్టి ఈ ప్రాజెక్ట్ ను సెట్ చేసుకుంది. అయితే ప్రసన్న రాసుకున్న స్క్రిప్ట్ హరీష్ శంకర్ మళ్ళీ రాశాడా లేక మరో కొత్త సబ్జెక్ట్ రాశాడా అనేది కొంత కాలం తర్వాత తెలుస్తుంది. (Harish Shankar)

Join WhatsApp