Hero Heroine Worst Combinations In Tollywood Movies

Tollywood: సినిమా హిట్ అవ్వాలి అంటే కథా, కథనంతో పాటు హీరో-హీరోయిన్ల జోడి కూడా బాగుండాలి. హీరో, హీరోయిన్ జోడి ఎంత అట్రాక్టివ్ గా ఉంటే సినిమాకి అంత క్రేజ్ వస్తుంది. బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి మన తెలుగు తెరపై ఎన్టీఆర్-సావిత్రి, కృష్ణ-విజయనిర్మల, చిరంజీవి-రాధా, బాలకృష్ణ-విజయశాంతి, వెంకటేష్-సౌందర్య, నాగార్జున-టబు.. ఇలా ఎప్పటికీ గుర్తుండిపోయే హీరో, హీరోయిన్ల కాంబినేషన్స్ ఎన్నో ఉన్నాయి.

Hero Heroine Worst Combinations In Tollywood Movies

అలాగే అస్సలు సెట్ అవ్వని వరస్ట్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి. అటువంటి కాంబినేషన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. షాడో 2013 లో వచ్చిన యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ ఇది. మెహ‌ర్‌ రమేష్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో వెంకటేష్, తాప్సీ జంటగా నటించారు. అయితే వీరి కాంబినేషన్ తెరపై అస్సలు సెట్ కాలేదు. వెంకటేష్, తాప్సీ తండ్రి కూతుళ్ళు మాదిరి ఉన్నారని సినీ ప్రియలు అప్పట్లో దారుణంగా విమర్శలు చేశారు.

Hero Heroine Worst Combinations In Tollywood Movies

2008లో వై. వి .ఎస్. చౌదరి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వచ్చిన చిత్రం ఒక్క మగాడు. ఈ సినిమాలో బాలకృష్ణకు జోడిగా అనుష్క నటించింది. వీరి కాంబినేషన్ ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచింది. సినిమా పరాజయం కావడానికి బాలయ్య-అనుష్క జోడి కారణమని అప్పట్లో చాలామంది భావించారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ తేజ కలయికలో వచ్చిన చిత్రం నిజం. ఈ చిత్రంలో రక్షిత హీరోయిన్ గా నటించింది. ఆన్ స్క్రీన్ పై మహేష్ బాబు, రక్షిత జోడి ఏమాత్రం సెట్ అవ్వకపోవడం నిజం మూవీకి ఒక పెద్ద మైనస్ అని చెప్పుకోవచ్చు.

Hero Heroine Worst Combinations In Tollywood Movies

2012లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా బోయపాటి శ్రీను తెర‌కెక్కించిన‌ దమ్ము సినిమా విడుదలైంది. ఈ చిత్రంలో త్రిష మెయిన్ హీరోయిన్ గా నటించింది. కానీ ఎన్టీఆర్ పక్కన త్రిష అసలు సెట్ కాలేదని విమర్శలు వచ్చాయి.

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య డెబ్యూ మూవీ జోష్. ఈ చిత్రంలో రాధ కూతురు కార్తీక హీరోయిన్ గా నటించింది. కానీ నాగచైతన్య, కార్తీక కాంబినేషన్ తెరపై ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది.(Tollywood)

Also Read: Rajamouli: వ‌య‌సులో రాజ‌మౌళి కంటే ఆయ‌న భార్య ర‌మా ఎన్నేళ్లు పెద్ద‌వారో తెలుసా?

ఇక వరుడు సినిమాలో అల్లు అర్జున్-భానుశ్రీ మెహ్రా జోడి, మన్మథుడు 2 చిత్రంలో నాగార్జున-రకుల్ ప్రీత్ సింగ్ జోడి, ద్రోణ చిత్రంలో నితిన్‌-ప్రియ‌మని జోడి, సింహ చిత్రంలో బాలకృష్ణ-స్నేహ ఉల్లాల్‌ జోడి తెలుగు తెరపై వరస్ట్ కాంబినేషన్స్ గా సినీ ప్రియుడు ముద్ర వేశారు. ఇటువంటి కాంబినేషన్స్ మళ్ళీ రిపీట్ కాకూడదని కోరుకున్నారు.

Join WhatsApp