Hero Manchu Manoj's wife gave birth to a child

Manchu Manoj: కలెక్షన్ కింగ్ మోహన్ బాబు చిన్న తనయుడు మంచు మనోజ్ మనందరికీ సుపరిచితమే. చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం హీరోగా కొనసాగుతున్నాడు మంచు మనోజ్. పోటుగాడు, బిందాస్ వంటి ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.

Hero Manchu Manoj’s wife gave birth to a child

హిట్ అండ్ ఫ్లాప్ అనేది పట్టించుకోకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇక గతంలో ఈనని ప్రణతి రెడ్డి అనే అమ్మాయి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అనంతరం వీరి మధ్య అనేక కలహాలు రావడంతో విడిపోయారు. గత ఏడాది భూమా మౌనికని రెండో పెళ్లి చేసుకున్నాడు మంచు మనోజ్. ఈమె ప్రెగ్నెంట్ అవ్వడం ఆ ఫోటోలను మనోజ్ షేర్ చేయడం వంటివి మనం చూస్తూనే వచ్చాం.

Also Read: Heroine: 11 ఎఫైర్స్.. పెళ్లి కాకముందే తల్లి.. 47 ఏళ్లకు సక్సెస్ అయిన హీరోయిన్ ఎవరంటే..!

తాజాగా మంచు మనోజ్ తండ్రయ్యాడు. అతని భార్య భూమా మౌనిక పండంటి ఆడబిడ్డ కి జన్మనిచ్చింది. ఈ విషయాన్ని మనోజ్ అక్క మంచు లక్ష్మి, భూమా మౌనికాతన instagram ద్వారా వెల్లడించారు. ఇందులో భూమా మౌనిక..” ఇప్పుడు మేము నలుగురం అయ్యాం. ఎంతోమంది దేవుళ్ళు ఆశీర్వాదంతో మా ఇంటికి దేవత వచ్చింది. మేము ఎంతగానో ఎదురు చూస్తున్న బేబీ వచ్చేసింది.

Hero Manchu Manoj's wife gave birth to a child

అన్న అయినందుకు ధైరవ్ ఆనందానికి హద్దులు లేవు. ఆమెను మేము ముద్దుగా ఎంఎం పులి అని పిలుస్తున్నాము. మా కుటుంబం పై ఆ శివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాం. మమ్మల్ని ఆశీర్వదించండి ” అంటూ రాసుకొచ్చారు మంచు లక్ష్మి మరియు భూమా మౌనిక.(Manchu Manoj)

Join WhatsApp