Heroine secret marraige

Heroine: చాలామంది సినిమా ఇండస్ట్రీ కి సంబంధించిన నటీనటులు వారి పర్సనల్ విషయాలను రహస్యంగా ఉంచడానికి ఇష్టపడతారు. అయితే వారి రిలేషన్షిప్ స్టేటస్ ని రహస్యంగా ఉంచడానికి కారణం సినిమాల్లో అవకాశాలు తగ్గిపోతాయేమోనన్న భయం.. మరి కొంత మందేమో హీరోయిన్ అవకాశాలు ఇవ్వరు అని భయపడి,అలా తమ ప్రేమ పెళ్లి విషయాలను బయటపెట్టారు. అయితే ఇప్పటికే చాలామంది హీరోయిన్లు సీక్రెట్ గా పెళ్లిళ్లు చేసుకొని పెళ్ళయ్యాక కొద్ది రోజులకు ఆ విషయాన్ని బయటపెట్టిన వాళ్ళు ఉన్నారు.

Heroine secret marraige

అలాంటి వారిలో శ్రియాశరన్, కాజల్ అగర్వాల్,పూర్ణ, రీసెంట్ గా పెళ్లి చేసుకున్న తాప్సీ పన్ను..ఇలా కొంతమంది హీరోయిన్లు రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. అయితే తాజాగా మరొక హీరోయిన్ కూడా సీక్రెట్ గా పెళ్లి చేసుకోబోతుందట.ఇక ఆ హీరోయిన్ ఎవరో కాదు అతిథి రావు హైదరి. రీసెంట్ గానే నటుడు సిద్ధార్థ్ తో వనపర్తి లోని ఓ గుడిలో రహస్యంగా ఎంగేజ్మెంట్ చేసుకున్న అదితి రావు హైదరి త్వరలోనే పెళ్లి కూడా సీక్రెట్ గా చేసుకోబోతుందట.(Heroine)

Also Read: Madhuri Dixit: ఈ నటి కట్టుకున్న చీర ఖరీదు మరీ అంత కాస్టా.?

అయితే రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో సిద్ధార్థ్ పెళ్లికి సంబంధించిన డేట్ ఇంకా ఫిక్స్ చేసుకోలేదని చెప్పారు. కానీ అతిధి రావు హైదరి మాత్రం పెళ్లికి సంబంధించిన పనులు మొదలు పెట్టేసిందట. ముంబైలో కొంతమంది డిజైనర్లను తరచూ కలుస్తూ అలాగే ముంబైలోని కొన్ని మేకప్ స్టూడియోలలో ఈ హీరోయిన్ కనిపిస్తుందట. అంతేకాకుండా సమయం దొరికినప్పుడల్లా పెళ్లికి సంబంధించిన షాపింగ్ చేస్తూ షాపింగ్ మాల్స్ లో ఎక్కువగా గడుపుతోందట.

Heroine secret marraige

దీంతో ఈమె గురించి తెలిసిన కొంతమంది ఇండస్ట్రీ జనాలు పెళ్లి డేట్ పెట్టుకోకుండా ఆమె ఎందుకు ఇలా పెళ్లి పనులు స్టార్ట్ చేస్తుంది అని అనుకుంటున్నారు.ఇక మరికొంత మందేమో పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకున్నారని, అందుకే పెళ్లి పనులు ఇప్పటినుండే స్టార్ట్ చేస్తుంది అని భావిస్తున్నారు.ఇక ఎంగేజ్మెంట్ రహస్యంగా చేసుకున్నట్టు పెళ్లి కూడా రహస్యంగా చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది. మరి చూడాలి అతిథి రావు హైదరి, సిద్ధార్థ్ నిశ్చితార్థం రహస్యంగా చేసుకున్నట్టే పెళ్లిని కూడా రహస్యంగా చేసుకుంటారా లేక అందరికీ చెప్పే చేసుకుంటారా అనేది తెలియాల్సి ఉంది.(Heroine)

Join WhatsApp