Heroine Sneha sensational comments

Sneha: అందం, అభినయంతో అలరించిన హీరోయిన్లలో స్నేహ ముందు స్థానంలో ఉంటుంది. ప్రియమైన నీకు సినిమాతో తెలుగువారికి పరిచయమైన ఈ బ్యూటీ హనుమాన్ జంక్షన్, వెంకీ, సంక్రాంతి, రాధాగోపాలం, శ్రీరామదాసు, ఏవండోయ్ శ్రీవారు, పాండురంగడు.. ఇలా అనేక చిత్రాల్లో కథానాయకగా నటించింది. 2009లో అచ్చముందు అచ్చముందు అని తమిళ్ సినిమాలో నటుడు ప్రసన్న తో జోడిగా నటించింది. ఆ సమయంలో వీరు ప్రేమలో పడ్డారు. 2012 లో పెళ్లి చేసుకున్నారు.

Heroine Sneha sensational comments

వీరికి ఒక పాప బాబు కూడా జన్మించారు. పెళ్లి అనంతరం స్నేహ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయింది. తెలుగులో చివరగా వినయ విధేయ రామ లో కనిపించింది. ఇటీవలే చీరల బిజినెస్ లోకి దిగింది స్నేహ. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ ముద్దుగుమ్మ..” పొజిసివ్‌నెస్ ఉండాలి. కానీ అతిగా ఉండకూడదు. అది ఎక్కువైతే నమ్మకాన్ని బ్యాలెన్స్ చేయలేం. ఉదాహరణకు బయటకు ఎందుకు వెళ్తున్నావు? ఈ సమయంలో వెళ్లి ఏం చేస్తావు? ఇలాంటి ప్రశ్నలు తలెత్తకూడదు.

Also Read: Periods: ఆడవారి నెలసరి నెప్పును తగ్గించే సులభమైన మార్గాలు ఇవే..!

మనల్ని అవతలి వ్యక్తి సరిగ్గా అర్థం చేసుకుంటే ఈ ప్రశ్నలు రావు. ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలి. ఒకరు మనల్ని అడిగే ముందు.. నేను ఫలానా చోటకు వెళ్తున్నాను.. ఈ సమయంలోపు వస్తాను అని సమాచారం ఇవ్వాలి. ఇక్కడికి వెళ్లాక కూడా మీకు టైముంటే ఒకసారి మీ భాగస్వామికి ఫోన్ చేసి నేను చేరుకున్నాను, నువ్వు భోజనం చేసావా? అని ఆరా తీయాలి. ఇలాంటి చిన్న చిన్నవి ప్రేమను, నమ్మకాన్ని పెంచుతాయి. పెళ్లయిన కొత్తలో నేను కూడా పోసిటివ్గా ఉండేదాన్ని.

Heroine Sneha sensational comments

అలా అని తనపై నమ్మకం లేదని అర్థం కాదు. గతంలో నా భర్త ఓ అమ్మాయిని ప్రేమించాడు. కానీ వారికి బ్రేకప్ అయ్యింది. దానివల్ల నాకు ఎలాంటి సమస్య లేదు. ఎందుకంటే ఆ బ్రేకప్ జరిగి ఉండకపోతే నాకు ప్రసన్న భర్తగా దొరికే వాడే కాదు? అప్పుడు నాకు ఇంకో సమస్య వచ్చి పడడంతో ఆ ఏడాదంతా ఎంతో కష్టంగా నడిచింది ” అంటూ చెప్పుకొచ్చింది స్నేహ. ప్రస్తుతం ఈమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(Sneha)

Join WhatsApp