Heroine that Venkatesh doesn't like

Venkatesh: ఇండస్ట్రీలో ఎలాంటి వివాదం లేని కూల్ అండ్ కామ్ గా ఉండే హీరోగా పేరు తెచ్చుకున్నారు వెంకటేష్. అలాంటి హీరో ఓ హీరోయిన్ ని చూస్తే అస్సలు తన కోపాన్ని కంట్రోల్ చేసుకోరట.ఆ హీరోయిన్ కి వెంకటేష్ కి మధ్య పచ్చ గడ్డి వేస్తే బొగ్గు మనేంత పగ ఉందట.మరి ఇంతకీ వెంకటేష్ కి ఏ హీరోయిన్ అంటే నచ్చదు.. ఎందుకు వారిద్దరి మధ్య అంత పెద్ద వైరం జరిగింది అనే సంగతి ఇప్పుడు చూద్దాం..వెంకటేష్ కి బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ అంటే అస్సలు ఇష్టం ఉండదట.అయితే వీరిద్దరి కాంబినేషన్లో మల్లీశ్వరి సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయింది.

Heroine that Venkatesh doesn’t like

అలా ఒక సినిమాలో కలిసీ నటించాక కూడా వీరిద్దరి మధ్య గొడవ ఎక్కడ వచ్చిందని మీ అందరికీ అనుమానం రావచ్చు. అయితే మల్లీశ్వరి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఆ తర్వాత ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే సినిమాలో కూడా కత్రినా కైఫ్ నే హీరోయిన్గా తీసుకున్నారట మూవీ మేకర్స్.అలా ఈ సినిమా కి కత్రినా కైఫ్ అగ్రిమెంట్ కూడా రాసిచ్చి డేట్స్ కూడా కేటాయించిందట. అయితే చివరికి షూటింగ్ స్టార్ట్ చేసే మొదటి సన్నివేశాన్ని కత్రినా కైఫ్, వెంకటేష్ ల మధ్య తీయాలి అనుకున్నారట డైరెక్టర్ సెల్వరాఘవన్ . దాంతో ఒక రోజు ముందే చిత్ర యూనిట్ కి అలాగే నటీనటులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారట. (Venkatesh)

Also Read: Mahesh Babu: పాన్ ఇండియా సినిమాలు తీయకముందే టాప్ హీరోలలో సెకండ్ ప్లేస్ కొట్టేసిన మహేష్.. చిరంజీవికి ఘోర అవమానం..!

అయితే తెల్లవారక షూటింగ్ సెట్ కి వచ్చాక హీరో డైరెక్టర్ తో పాటు మిగిలిన వాళ్ళందరూ షూటింగ్ స్పాట్ కి వచ్చారట.కానీ కత్రినా కైఫ్ మాత్రం ఎంతసేపు వెయిట్ చేసినా కూడా రాలేదట. ఇక వెయిట్ చేసి వెయిట్ చేసి కత్రినా మేనేజర్ కి ఫోన్ చేయగా సారీ సార్ మా మేడం వేరే సినిమాకి కూడా డేట్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్లో ఉంది అని చావు కబురు చల్లగా చెప్పినట్లు చెప్పారట. దాంతో కోపంతో ఊగిపోయిన డైరెక్టర్ ఇదేంటి అమ్మాయి ఇలా చేసింది. అన్ని అనుకున్నాక అని వెంకటేష్ తో చెబుతూ తిట్టుకున్నారట.ఇక వెంకటేష్ కూడా చాలా కోపంతో సినిమాలో నటించిన ఇష్టం లేకపోతే ముందే చెప్పాల్సింది.

Heroine that Venkatesh doesn't like

వేరే హీరోయిన్ ని తీసుకునే వాళ్ళం కదా. ఇప్పుడు షూటింగ్ సెట్ కి కూడా వచ్చాక నాకు కుదరదు అంటే ఆమె ఏమనుకుంటుంది. ఇంకొకసారి ఆమెను ఏ సినిమాలో కూడా నమ్మి తీసుకోకూడదు. మనం ఆమె విషయంలో నిండా మునిగిపోయాం.. అంటూ అప్పటినుంచి వెంకటేష్ కత్రినా కైఫ్ పై కోపాన్ని పెంచుకున్నారట. ఇక కత్రినా కైఫ్ వేరే సినిమాలో నటించడంతో ఆ హీరోయిన్ ని తీసేసి వెంటనే త్రిషని పెట్టుకొని ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే సినిమా షూటింగ్ ముగించి చివరికి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టారు. అలా ఈ సినిమా కారణంగా వెంకటేష్ కత్రినా కైఫ్ల మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయట.(Venkatesh)

Join WhatsApp