Heroine who is going to replace Samantha in Naga Chaitanya's life

Naga Chaithanya: అక్కినేని నాగచైతన్య జీవితంలో ఒక కొత్త హీరోయిన్ ఎంట్రీ ఇచ్చిందా.. నాగచైతన్య జీవితంలో సమంతకి ఉన్న స్థానాన్ని ఆ హీరోయిన్ నిజంగానే భర్తీ చేయగలదా.. మరి ఇంతకీ నాగచైతన్య లైఫ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆ హీరోయిన్ ఎవరు అనే సంగతి ఇప్పుడు తెలుసుకుందాం.. నాగ చైతన్య లైఫ్ లో సమంత ఒక స్పెషల్ గెస్ట్ లాగా ఆయన లైఫ్ లోకి వచ్చి వెళ్ళిపోయింది. కానీ జీవితాంతం గుర్తుండిపోయే అనుభవాలను ఆయనకు పంచింది అని చెప్పుకోవచ్చు.

Heroine who is going to replace Samantha in Naga Chaitanya’s life

ఎందుకంటే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలతో పాటు వీరిద్దరి రిలేషన్, వీరిద్దరి జోడిని ఎంతోమంది సినిమా వాళ్ళు కూడా మెచ్చుకున్నారు. అయితే అన్యోన్యంగా ఉండే వీరి జంటపై ఏ దిష్టి కళ్ళు పడ్డాయో కానీ ఇద్దరి మధ్య గొడవలు వచ్చి విడాకులు తీసుకున్నారు. ఇక విడిపోయాక కూడా ఇద్దరు కలవాలని ఇప్పటికీ ఆ దేవుడిని వేడుకుంటున్న అభిమానులు ఎంతో మంది ఉన్నారు కానీ అది కుదిరే పని కాదు..(Naga Chaithanya)

Also Read: Prabhas: దేశంలోనే గొప్ప రికార్డును సొంతం చేసుకున్న ప్రభాస్.. నిజంగా హ్యాట్సాఫ్ బ్రో…!

ఇక ఈ విషయం పక్కన పెడితే..సమంత తర్వాత నాగచైతన్య లైఫ్ లో సమంత స్థానాన్ని రిప్లేస్ చేసిన ఒకే ఒక్క హీరోయిన్ నాచురల్ బ్యూటీ సాయి పల్లవి అంటూ సోషల్ మీడియాలో కొంతమంది నెటిజెన్స్ సాయి పల్లవి నాగచైతన్య ఫోటోలను వైరల్ చేస్తున్నారు.అయితే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన లవ్ స్టోరీ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్లో తండేల్ అనే మూవీ కూడా రాబోతుంది. (Naga Chaithanya)

Heroine who is going to replace Samantha in Naga Chaitanya's life

ఇక ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అని అభిమానులు ముందుగానే భావిస్తున్నారు. అంతేకాదు సమంత తర్వాత సాయి పల్లవే నాగచైతన్యకు సరైన జోడి అని వీరిద్దరి పెళ్లి జరిగితే కూడా బాగుండు అంటూ నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు. అలాగే నాగచైతన్యకు సాయి పల్లవి ని రెండో పెళ్లి చేసుకోమని కూడా నెట్టింట్లో కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ పోస్టులు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.(Naga Chaithanya)

Join WhatsApp