Heroine who said she will not act with Naga Chaitanya

Naga Chaitanya: స్టార్ హీరో తో సినిమా అంటే ఎవరైనా సరే ఓకే చెబుతారు.. కానీ ఓ స్టార్ హీరో కూతురు మాత్రం నేను ఆ హీరో సినిమాలో కోట్లు ఇచ్చినా కూడా అస్సలు నటించను అని మొహం మీదే చెప్పేసిందట. మరి ఇంతకీ ఆమె ఎవరు.. ఏ హీరో సినిమాలో నటించనని చెప్పిందో ఇప్పుడు తెలుసుకుందాం.. స్టార్ హీరో నాగార్జున పెద్ద కొడుకు నాగచైతన్య టాలీవుడ్ లో మిడిల్ రేంజ్ హీరోగా కొనసాగుతున్నారు.

Heroine who said she will not act with Naga Chaitanya

ఈయన దూత వెబ్ సిరీస్ తో హిట్ కొట్టడంతో దానికి సీక్వెల్ త్వరలోనే తీయబోతున్నట్టు క్లారిటీ ఇచ్చారు.అయితే ప్రస్తుతం నాగ చైతన్య సాయి పల్లవి తో తండేల్ అనే మూవీలో చేస్తున్నారు. ఇక ఈ సినిమాపై ఇప్పటికే భారీ ఆచనాలు పెట్టుకున్నారు అభిమానులు. అయితే తాజాగా నాగచైతన్య గురించి ఒక వార్త చక్కర్లు కొడుతోంది.(Naga Chaitanya)

Also Read: Surbhi: చావు అంచుల వ‌ర‌కు వెళ్లొచ్చిన సురభి.. ఫుల్‌గా భ‌య‌ప‌డిపోయిన హీరోయిన్‌.. ఏం జ‌రిగిందంటే?

అదేంటంటే నాగచైతన్య సినిమాలో చేయమంటే ఆ స్టార్ హీరోయిన్ నేను చేయను అని చెప్పిందట. మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో అనుకుంటున్నారా ఆమె ఎవరో కాదు ప్రస్తుతం తెలుగులో లేడీ విలన్ గా వరుస సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్న వరలక్ష్మి శరత్ కుమార్..

Heroine who said she will not act with Naga Chaitanya

శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి నాగచైతన్య సినిమాలో అవకాశం వస్తే కోట్లు ఇచ్చినా సరే నేను ఆయన సినిమాలో చేయను అని డైరెక్టర్ కి మొహం మీదే చెప్పేస్తుందట. దానికి ప్రధాన కారణం సమంత తో స్నేహమే.. వరలక్ష్మి సమంత బెస్ట్ ఫ్రెండ్స్ అట.అందుకే సమంతతో విడాకులు అయ్యాక నాగచైతన్య సినిమాలో వరలక్ష్మికి అవకాశం వచ్చిందట.కానీవరలక్ష్మి మాత్రం నేను నటించను అని ఆ మూవీ ఆఫర్ రిజెక్ట్ చేసిందట.(Naga Chaitanya)

Join WhatsApp