Honey Rose Get Chance In Chiranjeevi Movie

Honey Rose: హ‌నీ రోజ్‌.. ఈ హాట్ బ్యూటీని సౌత్ సినీ ప్రియుల‌కు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేదు. మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీలో భారీ స్టార్డ‌మ్ తో ఓ వెలుగు వెలుగుతున్న హ‌నీరోజ్‌.. గ‌త ఏడాది వీర‌సింహారెడ్డి మూవీతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు చేరువైంది. బాల‌య్య‌కు జోడీగా న‌టించి టాలీవుడ్ లో సూప‌ర్ పాపుల‌ర్ అయింది. వీర సింహారెడ్డి ఘ‌న విజ‌యం సాధించ‌డంతో హ‌నీ రోజ్ టాలీవుడ్ లో ఫుల్ బిజీ అవుతుంద‌ని అంతా అనుకున్నారు. కానీ, అలా జ‌ర‌గ‌లేదు.

Honey Rose Get Chance In Chiranjeevi Movie

సోష‌ల్ మీడియా మ‌రియు షాపింగ్ మాల్‌ ఓపెనింగ్స్ లో త‌ప్పితే వీరసింహారెడ్డి త‌ర్వాత హ‌నీ రోజ్ మ‌రో తెలుగు సినిమాలో క‌నిపించ‌లేదు. కానీ, ఎట్ట‌కేల‌కు ఈ బ్యూటీ ఓ టాలీవుడ్ మూవీలో ఛాన్స్ ద‌క్కించుకుంది. మెగాస్టార్ చిరంజీవితో హ‌నీ రోజ్ స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది. ప్ర‌స్తుతం చిరంజీవి చేతిలో ఉన్న క్రేజీ ప్రాజెక్ట్స్ లో విశ్వంభ‌ర ఒక‌టి. బింబిసార ఫేమ్ వశిష్ఠ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు.

సోషియో ఫాంటసీ జానర్‌లో తెరకెక్కుతున్న విశ్వంభరను యూవీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై భారీ బ‌డ్జెట్ తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. ఆల్రెడీ ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయింది. ఫిబ్ర‌వ‌రి నుంచి చిరంజీవి కూడా షూటింగ్ లో జాయిన్ అయ్యేందుకు రెడీ అవుతున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ చిత్రం కోసం దాదాపు 7 ఎకరాల్లో 13 భారీ సెట్స్ నిర్మిస్తున్నారు.(Honey Rose)

Also Read: Krithi Shetty: దారుణంగా మారిన కృతి శెట్టి ప‌రిస్థితి.. అలా చేస్తాన‌న్నా ఆఫ‌ర్లు ఇవ్వ‌ట్లేదా?

అయితే ఈ సినిమాలో హీరోయిన్స్ ఎవ‌రు అన్న‌ది ఇంకా చిత్ర‌టీమ్ వెల్ల‌డించ‌లేదు. కానీ, ముగ్గురు హీరోయిన్లు ఉంటార‌ని తెలిపారు. ఈ క్ర‌మంలోనే అనుష్క శెట్టి, మృణాల్ ఠాకూల్‌, త‌మ‌న్నా, న‌య‌న‌తార వంటి తార‌ల పేర్లు తెర‌పైకి కూడా వ‌చ్చాయి. తాజాగా హ‌నీ రోజ్ విశ్వంభ‌ర‌లో న‌టించ‌బోతోంద‌ని ఓ న్యూస్ నెట్టింట‌ వైర‌ల్ గా మారింది. ముగ్గురు హీరోయిన్ల‌లో ఒక‌రిగా హ‌నీ రోజ్ క‌నిపించ‌నుంద‌ని.. ఇప్ప‌టికే సంప్ర‌దింపులు కూడా పూర్తైన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ ప్ర‌చారం ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియాలంటే అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్‌ రావాల్సిందే. కాగా, సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉన్న‌ప్ప‌టికీ.. చిరుతో వాళ్ల రొమాన్స్ ఎక్స్‌పెక్ట్ చేయొద్ద‌ని, క‌థ ప్రకారమే అన్ని పాత్రలు నడుచుకుంటాయని గ‌తంలో దర్శకుడు వశిష్ట తెలిపాడు.

Join WhatsApp