How did Namrata Shirodkar Missed Okkadu movie?

Okkadu: టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేష్ బాబు కెరీర్ లో ఎప్ప‌టికీ గుర్తుండిపోయే చిత్రాల్లో ఒక్క‌డు మూవీ టాప్ ప్లేస్‌లో ఉంటుంది. గుణశేఖ‌ర్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో మ‌హేష్ బాబు, భూమిక జంట‌గా న‌టించారు. ప్ర‌కాష్ రాజ్, ముకేష్ రిషి, చంద్రమోహన్, గీత‌, శకుంత‌ల త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యాన‌ర్ పై ఎం. ఎస్. రాజు నిర్మించిన ఒక్క‌డు చిత్రం 2003లో సంక్రాంతి కానుక‌గా విడుద‌లై భారీ విజ‌యాన్ని అందుకుంది. బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్స్ వ‌ర్షాన్ని కురిపించి సంక్రాంతి విన్న‌ర్ గా నిలిచింది.

How did Namrata Shirodkar Missed Okkadu movie?

అలాగే మ‌హేష్ బాబు కెరీర్ లో ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీగా రికార్డు సృష్టించింది. రూ.14 కోట్ల బడ్జెట్‌తో నిర్మిత‌మైన ఈ చిత్రం దాదాపు రూ.30 కోట్ల రేంజ్ లో షేర్ వ‌సూళ్ల‌ను సాధించింది. గుణ‌శేఖ‌ర్ స్క్రీన్ ప్లే, మ‌హేష్ బాబు-భూమిక కెమిస్ట్రీ, మ‌ణిశ‌ర్మ అందించిన మ్యూజిక్‌, సాంగ్స్, ఫైట్స్, చార్మినార్ సెట్‌ సినిమాకు హైలెట్‌గా నిలిచాయి. దాంతో ప్రేక్ష‌కులు ఒక్క‌డు చిత్రాన్ని విశేషంగా ఆధ‌రించారు.

అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర విష‌యం తెర‌పైకి వ‌చ్చింది. ఒక్క‌డు మూవీలో మ‌హేష్ బాబుకు జోడీగా న‌మ్ర‌త చేయాల్సింద‌ట‌. అప్ప‌టికే మ‌హేష్ బాబు, న‌మ్ర‌త జంట‌గా వంశీ మూవీ చేశారు. ఈ సినిమా క‌మ‌ర్షియ‌ల్ గా ఫ్లాప్ అయినా కూడా మ‌హేష్‌-న‌మ్ర‌త మ‌ధ్య కెమిస్ట్రీ మాత్రం బాగా వ‌ర్కోట్ అయింది. పైగా ఇద్ద‌రూ సీక్రెట్ గా ప్రేమాయ‌ణాన్ని కొన‌సాగిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఒక్కడ క‌థ ఒకే అవ్వ‌గానే హీరోయిన్ క్యారెక్ట‌ర్ కోసం మ‌హేష్ బాబు న‌మ్ర‌త పేరును సూచించార‌ట‌.(Okkadu)

Also Read: Mohan Babu: ఆ హీరోయిన్ మోజులో పడి నిర్మాతని రోడ్డుపాలు చేసిన మోహన్ బాబు..!!

గుణ‌శేఖ‌ర్ కూడా న‌మ్ర‌తను ఎంపిక చేయ‌డానికి మొగ్గు చూపారు. కానీ, ఈ విష‌యం కృష్ణ‌కు తెలియ‌డంతో.. ఆయ‌న‌ వెంట‌నే న‌మ్ర‌త హీరోయిన్ గా వ‌ద్ద‌ని సూచించార‌ట‌. ఎందుకంటే, బాలీవుడ్ లో వ‌రుస సినిమాలు చేస్తున్న‌ప్ప‌టికీ న‌మ్ర‌త‌కు స‌క్సెస్ రేటు మాత్రం చాలా త‌క్కువ‌గా ఉంది. పైగా ఇటు టాలీవుడ్ లో చేసిన వంశీ మూవీ ద్వారా న‌మ్ర‌త తెలుగు వారికి పెద్ద‌గా ద‌గ్గ‌ర కాలేక‌పోయింది. అందుకే ఆమెకు బ‌దులుగా మ‌రొక హీరోయిన్ ను ఎంపిక చేయాలని కృష్ణ స‌ల‌హా ఇచ్చార‌ట‌. దాంతో గుణ‌శేఖ‌ర్ బాగా ఆలోచించిన ఖుషి, సింహాద్రి చిత్రాల‌తో అప్పుడే ఫామ్‌లోకి వ‌చ్చిన భూమిక‌ను హీరోయిన్ గా ఎంపిక చేశార‌ట‌. అలా కృష్ణ కార‌ణంగా న‌మ్ర‌త చేయాల్సిన ఒక్క‌డ మూవీ భూమిక చేతికి వెళ్లింద‌ని అంటున్నారు.

Join WhatsApp