How did Samantha Lost ₹12 Crores?

Samantha: స్టార్ట్ బ్యూటీ స‌మంత ఇటీవ‌ల సినిమాల‌కు బ్రేక్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. అనారోగ్య స‌మ‌స్య‌ల కార‌ణంగా ఆమె కెమెరాకు దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యించుకుంది. ఇందులో భాగంగానే ఖుషి, సిటాడెల్ వంటి ప్రాజెక్ట్‌ల‌ను ఏక‌కాలంలో చ‌క‌చ‌కా పూర్తి చేసింది. మ‌రికొన్ని ప్రాజెక్ట్‌ల నుంచి త‌ప్పుకుంది. అలా త‌ప్పుకున్న వాటిలో ఓ హాలీవుడ్ మూవీ కూడా ఉంది. అదే చెన్నై స్టోరీ. బాఫ్తా అవార్డ్ విన్నర్ ఫిలిప్ జాన్ ఈ మూవీకి ద‌ర్శ‌కుడు.

How did Samantha Lost ₹12 Crores?

ఇండో-యుకె కో-ప్రొడక్షన్‌లో రూపొందే ఈ ఇంగ్లీష్ మూవీలో స‌మంత మెయిన్ లీడ్ లో యాక్ట్ చేయ‌నుంద‌ని గ‌తంలో అనౌన్స్ చేశారు. కానీ, హెల్త్ ఇష్యూస్ కార‌ణంగా స‌మంత సైడ్ అయింది. దాంతో సౌత్ కి చెందిన మ‌రో హీరోయిన్ ను ఆమె స్థానంలో చిత్ర టీమ్ ఎంపిక చేసింది. ఇంత‌కీ ఆ ల‌క్కీ హీరోయిన్ మ‌రెవ‌రో కాదు.. శృతి హాస‌న్‌. ఇటీవ‌ల స‌లార్ మూవీతో పాన్ ఇండియా స్థాయిలో బిగ్ హిట్ అందుకున్న శృతి హాస‌న్‌.. ఇప్ప‌టికే ది ఐ అనే హాలీవుడ్ మూవీలో న‌టిస్తోంది.

How did Samantha Lost ₹12 Crores?

తాజాగా చెన్నై స్టోరీకి కూడా సైన్ చేసింది. తాజాగా మూవీ టీమ్ ఈ విష‌యాన్ని అఫీషియ‌ల్ గా అనౌన్స్ చేశారు. దీంతో శృతి హాస‌న్ ఫుల్ ఖుషీలో మునిగి తేలుస్తోంది. ఎన్‌.మురారి రచించిన ఫేమస్ నవల ది అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్ ఆధారంగా చెన్నై స్టోరీ చిత్రం తెర‌కెక్క‌నుంది. ఇందులో వివేక్ కల్రా, శృతి హాస‌న్ జంట‌గా న‌టించ‌బోతున్నారు. ఇదొక క్రాస్-కల్చరల్ రోమ్-కామ్ అని అంటున్నారు. అలాగే ఈ మూవీలో చెన్నై కేంద్రంగా పనిచేసే ప్రైవేట్ డిటెక్టివ్ పాత్రలో శృతి హాస‌న్ అల‌రించ‌బోతుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.(Samantha)

Also Read: Lavanya Tripathi: అత్తింట్లో నిహారిక వల్ల టార్చర్ అనుభవిస్తున్న లావణ్య త్రిపాఠి.. బయటపడ్డ సంచలన నిజం..!!

ఇక‌పోతే ఈ హాలీవుడ్ మూవీ నుంచి త‌ప్పుకోవ‌డం వ‌ల్ల స‌మంత రూ. 12 కోట్లు న‌ష్ట‌పోయింద‌ని ఇన్‌సైడ్ బ‌లంగా టాక్ న‌డుస్తోంది. నిజానికి చెన్నై స్టోరీ చేయ‌డానికి స‌మంత చాలా ఇంట్రెస్ట్ చూపింది. ది అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్ న‌వ‌ల చ‌దివి మ‌రీ త‌న తొలి హాలీవుడ్ మూవీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్ట్‌కు గానూ రూ. 12 కోట్లు రెమ్యున‌రేష‌న్ కోట్ చేసింది. ఇది ఆమె కెరీర్ లోనే హైయ్యెస్ట్ రెమ్యున‌రేష‌న్‌. కానీ, ఇంత‌లోనే మయోసైటిస్ బారిన ప‌డ‌టంతో స‌మంత చాలా వీక్ అయింది. ఈ కార‌ణంగానే చెన్నై స్టోరీ నుంచి త‌ప్పుకుంది. ఫ‌లితంగా రూ. 12 కోట్లు న‌ష్ట‌పోయింద‌ని టాక్ న‌డుస్తోంది.

Join WhatsApp