How Do Fruit Seller Became the Son in Law of Amitabh Bachchan's house

Amitabh Bachchan: ఏ నిమిషంలో ఎవరు ఫేమస్ అవుతారో చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే టాలెంట్ ఉంటే చాలు ఎప్పటికైనా మనల్ని మనం ప్రూవ్ చేసుకోగలం.అలాగే ఎవరైతే మనల్ని హేళనగా చేసి చూస్తారా.. వారిని మన ఎదుగుదలతో తిప్పి కొట్టొచ్చు.ఇక ఇదంతా పక్కన పెడితే ఒకప్పుడు పళ్ళు అమ్మిన వ్యక్తి చివరికి తన టాలెంట్ తో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఇంటికి అల్లుడుగా వెళ్లారట. ఇక అసలు విషయంలోకి వెళ్తే..బాలీవుడ్ నటుడు కునాల్ కుమార్..

How Do Fruit Seller Became the Son in Law of Amitabh Bachchan’s house

ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఈయన అసిస్టెంట్ డైరెక్టర్ గా తన సినీ కెరీర్ ని మొదలుపెట్టి ఆ తర్వాత నటుడిగా కూడా ఇండస్ట్రీలో రాణించారు.అయితే అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో కునాల్ కుమార్ మాట్లాడుతూ.. నేను ఏదైనా సినిమా చేస్తే పూర్తిగా ఆ మూవీకి అంకితమై ఉంటాను. ఎందుకంటే ఒకవేళ ఈ సినిమాలపై ఇంట్రెస్ట్ లేకపోతే గనుక నేను అంతకుముందు ఎలా అయితే పండ్లను ఎగుమతి చేసేవాడినో ఇప్పుడు కూడా అదే పని చేసే వాడిని.

Also Read: Ram Charan: ఆ పెళ్ళైన హీరోయిన్ ని ప్రేమించిన రామ్ చరణ్.. అందుకే ఆ పని చేశారా..?

కానీ నాకు సినిమా అంటే పిచ్చి..అందుకే సినిమాల్లో ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా చేస్తున్నాను.. అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఈయన నటుడిగా మాత్రమే కాకుండా సామాజిక సేవకుడిగా కూడా మంచి గుర్తింపు సంపాదించారు. ఈయన క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్ కెట్టో వ్యవస్థాపకుడు కూడా.. ఈ సంస్థ ద్వారా ఆపదలో ఉన్న వారికి విరాళాలు సేకరించి వారికి అందజేస్తారు.. అలాంటి సంస్థ నడిపే వ్యవస్థాపకుల్లో ఒకరిగా పనిచేస్తున్న కునాల్ కుమార్ అమితాబ్ బచ్చన్ కి వరుసకి అల్లుడు అవుతారు.

How did the fruit man become the son-in-law of Amitabh Bachchan's house

ఎలాగంటే ఈయన అమితాబ్ బచ్చన్ సోదరుడు అయిన అజితాబ్ బచ్చన్ కూతురు నైనాను వివాహం చేసుకున్నాడు. అలా వరుసకి బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కి కూడా కునాల్ కుమార్ అల్లుడు అవుతారు. అలా ఒకప్పుడు పండ్లు బిజినెస్ చేసిన కునాల్ కుమార్ ప్రస్తుతం తన కృషి, పట్టుదలతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి నటుడి గానే కాకుండా ఆపదలో ఉన్న వారికి ఎంతో మందికి సహాయం కూడా చేసి ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్నారు.(Amitabh Bachchan)

Join WhatsApp