How many assets does Alia Bhatt have

Alia Bhatt: బాలీవుడ్ బడా నిర్మాత మహేష్ భట్ తనయిరాలు గా సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన అలియా భట్ తండ్రికి తగ్గ కూతురుగా పేరు తెచ్చుకుంది. ఆమె అందం అభినయంతో ఎంతోమంది కుర్రకారును కట్టిపడేసింది. అంతే కాదు చిన్న వయసులోనే పెళ్లి చేసుకొని ఒక పాపకు కూడా జన్మనిచ్చింది.మామూలుగా హీరోయిన్స్ అంటే 30 ఏళ్లు దాటే దాకా పెళ్లి చేసుకోరు.కానీ అలియా భట్ 30 ఏళ్లు కాకముందే పెళ్లాడింది.

How many assets does Alia Bhatt have

అయితే తాజాగా అలియా భట్ తన 31 బర్త్డేని జరుపుకుంటుంది. ఇక అలియా భట్ బర్త్ డే సందర్భంగా ఆమె గురించి కొన్ని తెలియని విషయాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.ఇదిలా ఉంటే అలియా భట్ భర్త కంటే ఎక్కువ సంపాదిస్తూ ఆయన కంటే ఎక్కువ ఆస్తిపాసులను కూడబెట్టిందట. అవును మీరు వింటున్నది నిజమే. అలియా భట్ ఆస్తి కొన్ని నివేదికల ప్రకారం దాదాపు 520 కోట్లు ఉందని తెలుస్తోంది. (Alia Bhatt)

Also Read: Shriya Saran: అది ఎలా చేయాలో నేర్పింది నాగార్జునే.. వైర‌ల్ గా మారిన శ్రియా బోల్డ్ కామెంట్స్‌!

ఇక రణబీర్ ఆస్తి కేవలం 365 కోట్లు మాత్రమే.ఈ లెక్కన చూసుకుంటే అలియా భట్ రణబీర్ కపూర్ కంటే ఎక్కువ ఆస్తి పాస్తులను కలిగి ఉంది. అలాగే అలియా తన ఒక్కో సినిమాకి 15 కోట్ల నుండి 17 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుంది.అంతేకాకుండా ఫ్లిప్కార్ట్, డ్యూrరోప్లేక్స్ మ్యాట్రెస్,లేస్, మేక్ మై ట్రిప్, ఫ్రూటీ,మాన్యవర్ వంటి ప్రముఖ బ్రాండ్స్ కి ప్రమోటర్ గా కూడా అలియా భట్ వ్యవహరిస్తోంది.

How many assets does Alia Bhatt have

అంతేకాకుండా ముంబైలోనే రిచ్ ఏరియా అయినా బాంద్రాలో ఈమెకు ఒక ఖరీదైన ఫ్లాట్ ఉంది. అలాగే లగ్జరీ కార్లైనా బిఎండబ్ల్యూ 7 సిరీస్,రేంజ్ రోవర్ వోగ్ వంటి లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. అలాగే కోట్ల విలువ చేస్తే లగ్జరీ ఇళ్లతో పాటు ఖరీదైన స్థలాలు కూడా ఈమె పేరు మీద చాలానే ఉన్నట్టు తెలుస్తుంది. ఇలా అలియా భట్ ఆస్తులు అన్ని కలిపి దాదాపు 520 కోట్లు అని తెలుస్తుంది.ఇక రణబీర్ కపూర్ 365 కోట్లు కూడా కలుపుకొని వీరిద్దరి ఆస్తులు 885 కోట్లు ఉంటాయట.(Alia Bhatt)

Join WhatsApp