Huge humiliation for Junior NTR in Chennai

Junior NTR: సహజంగా మనం ఎంతో ఇష్టంగా ఆదరించే స్టార్ హీరోని ఇతర దేశాల్లో గుర్తించకపోతే తమ ఫ్యాన్స్ కి ఎంతలా మండుతుందో మనందరికీ తెలిసిందే. ఇక తాజాగా జూనియర్ ఎన్టీఆర్ విషయంలో కూడా ఇదే జరిగింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ కి చెన్నైలో అస్సలు గుర్తింపే దక్కలేదు.

Huge humiliation for Junior NTR in Chennai

కనీసం జూనియర్ ఎన్టీఆర్ ఫోటో చూపించి ఈయన ఎవరు అని అడిగితే కూడా చెప్పలేకపోతున్నారు. అంత దీనస్థితి పట్టింది మరి జూనియర్ ఎన్టీఆర్ కి. ఇటీవలే ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో నేషనల్ అవార్డు సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ దాదాపు ప్రతి ఒక్క దేశంలోనూ గుర్తింపు పొందాడు. కానీ కొన్ని దేశాల్లో మాత్రం జూనియర్ ఎన్టీఆర్కి పెద్దగా పాపులారిటీ దక్కలేదు. వాటిలో చెన్నై కూడా ఒకటి. అక్కడి ప్రజలకు జూనియర్ ఎన్టీఆర్ పై పెద్దగా అవగాహన లేకపోవడంతో జూనియర్ ఎన్టీఆర్ పరువును మంట కలిపేస్తున్నారు.

Also Read: Anushka Shetty: అదృష్టం కలిసి వస్తే ఈపాటికి అనుష్క ఆ స్టార్ డైరెక్టర్ కోడలు అయ్యేదా.. లాస్ట్ మినిట్లో పెంట పెంట చేశాడుగా..!

తాజాగా ఓ మీడియా ఛానల్ నిర్వహించిన పబ్లిక్ టాక్ షోలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరమ్మాయిలని ఆపి జూనియర్ ఎన్టీఆర్ ఫోటో చూపించి ఈ ఇండియన్ యాక్టర్ పేరు ఏంటి చెప్పమని ప్రశ్నించగా.. వారు..” ఈ యాక్టర్ ని ఎక్కడో చూసినట్లు ఉంది కానీ నేమ్ గుర్తుకు రావడం లేదు. ఐ మీన్ ఎష్ అనుకుంటా. ప్రభాస్… నేను ఈ యాక్టర్ ని చాలా సినిమాల్లో చూశాను. బట్ పేరు గుర్తుకు రావడం లేదు. కొంచెం ఈ హీరో పేరు యొక్క ఫస్ట్ లెటర్ ని చెప్పగలరా “.. అనగా.. జె.. అని హింట్ ఇస్తారు.

Huge humiliation for Junior NTR in Chennai

అనంతరం ఇంటర్వ్యూ తీసుకునే యువకుడు జూనియర్ అనే ఫస్ట్ లెటర్ని సైతం చెబుతాడు. ఇతను ఆర్ఆర్ హీరో. ఐ మీన్ రామ్ చరణ్, రాజ్ కుమార్ అయ్యుంటారు. స్టార్ట్ విత్ ఎన్ అని మరోసారి ఆ యాంకర్ క్లూ ఇవ్వగా.. అయినా చెప్పలేకపోయారు అక్కడి ప్రజలు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. ఎన్ని హింట్స్‌ ఇచ్చిన అసలు పేరు దరిదాపుల్లోకి కూడా రాలేకపోయారు అంటే అసలు వారికి జూనియర్ ఎన్టీఆర్ పై అవగాహన లేదనే చెప్పుకోవచ్చు. ఏదేమైనా ఇది జూనియర్ ఎన్టీఆర్కి పెద్ద అవమానం అనే చెప్పాలి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.(Junior NTR)

Join WhatsApp